డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...
డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
యుగంధర్,వెల్దుర్తి సీఐ
కర్నూలు జిల్లా,బేలగల్ మండలం,ప్యాతోలి గ్రా మానికి చెందిన గొల్ల వెంకటేష్ అనే వ్యక్తి లక్ష రూపాయలు తీసుకుని,వాటిని మూడింతలు చేసి మూడు లక్షలు ఇస్తానని చెప్పి ఓ వ్యక్తిని మోసం చేసి పరారీలో తిరుగుతున్నాడు.మో సపోయిన బాధితుడు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా,పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగం గా మోసం చేసిన వెంకటేష్ అనే వ్యక్తిని గత శుక్రవారం వెల్దుర్తి గ్రామం శివారులో పోలీసు లు అరెస్టు చేశారు.ఈ సందర్బంగా వెల్దుర్తి సీఐ యుగంధర్ మాట్లాడుతూ నిందితుడు కొన్ని కె మికల్స్ ఉపయోగించి సాధారణ నోట్లను నల్ల గా మార్చి,వాటిని ప్రత్యేక పద్ధతిలో కెమికల్ తో కడిగితే అసలు నోట్లుగా మారుతాయని ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నట్లు తెలి పారు.నల్లటి కాగితాలను ఇచ్చి,కెమికల్ పేరు తో సాధారణ నీళ్లు అందించేవాడని పేర్కొన్నా రు.బాధితుడు వాటిని కడిగినా నగదుగా మా రకపోవడంతో తాను మోసపోయానని గుర్తిం చి,వెంకటేష్ ఆచూకీ తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేసులో నింది తుడి అరెస్టు సమయంలో కొన్ని నల్లటి కాగి తాలు,నల్లగా మార్చిన సాధారణ నోటు,నగదు రెండు లక్షలు పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని రి మాండ్ నిమిత్తం డోన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజ రు పరిచినట్లు తెలిపారు.ప్రజలు ఇలాంటి డ బ్బులు రెట్టింపు చేస్తామనే మోసపూరిత ట్రిక్స్ ను నమ్మి మోసపోవద్దని వెల్దుర్తి సీఐ యుగం ధర్ హెచ్చరించారు.ఈ కేసును విజయవంతం గా దర్యా ప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్యని,వేల్దుర్తి సీ ఐ యుగంధర్,క్రిష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తి, పోలీ సు సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అ భినందించారు.
Comments
Post a Comment