దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్

వి.వి.నాయుడు,రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,29 :

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డి ఓ కె. సందీప్ కుమార్ అని రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు వి.వి.నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.క ర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ చేసిన ప్రకటన పూర్తిగా అసత్యమని,దీనిని తీవ్రంగా ఖండిస్తు న్నా మని అన్నారు.ఆర్ డిఓ హోదా ను ఉపయోగించుకుని అసత్య ప్రచారం చేస్తూ అధికారులను,ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని ఆరోపించారు.అతను కలంధర్,అంజి అనే ప్రైవేటు వ్యక్తులను దలారులుగా పెట్టు కొని దందా నడుపుతూ,ఇతరులపై ఇష్టమొ చ్చినట్లు నిందలు వేయడం అతనికి అలవాటే నని అన్నారు.గార్గేయపురం విషయంలో ప్రెస్ నోట్ ఇచ్చింది బాధితులేనని,తాను కేవలం ప్రెస్‌కు పంపించడంలో సహాయం మాత్రమే చేశానని పేర్కొన్నారు.అంతేకాకుండా తాను ఆ భూమికి అగ్రిమెంట్ హోల్డర్‌నని,ఆర్ డిఓ 
మొన్నటి వరకు తనతో మంచిగానే చాటింగ్ చేసి భూమి విలువైనదని చెప్పారని అన్నారు. అనంతరం ఐదు లక్షల రూపాయలు అడిగార ని,ఇవ్వలేమని చెప్పడంతో అవతలి పార్టీతో మాట్లాడుకుని తమపై ఎదురు దాడి చేయడం ప్రారంభించారని ఆరోపించారు.చివరకు తహ సీల్దార్ నివేదికకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇ చ్చారని,ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడం ప్రారంభిం చగానే తన అధికారాన్ని ఉపయోగిస్తూ తమ పై దాడి చేయడం మొదలుపెట్టారని అన్నారు. మాకు సంబంధం లేని నన్నూరు ఆర్మీ (నేవీ) కే సులో వారికి ఎన్ ఓసి క్లియరెన్స్ ఇస్తానని,మీ రు నాయుడిపై ఎస్ సి /ఎస్టీ కేసులు,ఆర్మీ పేరును ఉపయోగించి ప్రెస్ నోట్లు పెట్టండి,ఫి ర్యాదులు చేయండి,దాడులు చేయండి అని మాట్లాడుకున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నారు.వారిని అడ్డుపెట్టుకుని తనపై దాడి చేయాలని చూస్తే ఆ ఆటలు సాగవని హెచ్చ రించారు.ఒక అధికారి అంటే ప్రజల సమస్య లు పరిష్కరించాల్సి ఉంటుందని,కానీ ఇతను మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించా రు.ఆర్ డిఓ కార్యాలయం నుంచి కలంధర్ ద్వారా ప్రెస్‌కు సమాచారం పంపించడం జరు గుతోందని,అసలు కలంధర్ ఎవరు? ప్రభుత్వ ఉద్యోగినా? కాంట్రాక్టు ఉద్యోగినా? లేక ఔట్‌సో ర్సింగ్ ఉద్యోగినా? ఏ ఉద్యోగి కానప్పుడు కా ర్యాలయంలో అతనికి అన్ని హక్కులు ఎందు కు ఇచ్చారో తెలియడం లేదని అన్నారు.డి ప్యుటేషన్ ఆర్డర్లు ఇవ్వడం,వారికి ఇష్టం వచ్చి నట్లు అధికార దుర్వినియోగం చేయడం జరు గుతోందని,వారే అసలైన దలారులని ఆరోపిం చారు.నూతనంగా స్కోడా కారు కూడా కొని చ్చారని సమాచారం ఉందని,అలాగే పంచలిం గాల భూ సేకరణ ఫైళ్లలో వారికి విలువ పెం చేందుకు సహాయపడ్డారని,కోటి రూపాయలు దలారుల ద్వారా తెప్పించుకున్నారని సమా చారం ఉందని అన్నారు.అలాగే ఓర్వకల్లు భూ సేకరణ,కోర్టు ఫైళ్లలో ఏ ఫైల్ వచ్చినా మొత్తం దలారులే చూసుకుంటున్నారని ఆరోపించా రు.తప్పుడు కేసులు పెడతామంటే భయపడే వారు ఎవరూ లేరని అన్నారు.ప్రభుత్వం,ప్రజ లకు మంచి పేరు తీసుకురావాలని ఆర్ డిఓ 
హోదాను ఇచ్చిందని,అయితే ఆ హోదాను అ ధికార దుర్వినియోగానికి ఉపయోగించడం సిగ్గుచేటని విమర్శించారు.కర్నూలు ఆర్ డిఓ కార్యాలయంలోని ఆర్ ఓ ఆర్ కేసులు,భూ సేకరణ ఫైళ్లు,భూ మార్పిడి ఫైళ్లపై విజిలెన్స్ వి చారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని తె లిపారు.ఇతనిపై న్యాయపరమైన పోరాటం కొ నసాగిస్తామని,ఇలాంటి అధికారుల వల్ల ప్రజల కు తీవ్ర నష్టం జరుగుతోందని,ప్రజల మధ్య చిచ్చు పెట్టే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిం చారు.చివరిగా ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ అ క్రమాలపై తాము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉం టామని వి.వి.నాయుడు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...