కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...
కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం
రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి
బాధితురాలు బైరెడ్డి హరిత
కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం అని బాధితురాలు బైరెడ్డి హరిత ఆరోపించారు.శనివారం కర్నూలు రూ రల్ మండలం,గార్గేయపురం గ్రామానికి చెంది న బాధితురాలు బైరెడ్డి హరిత,కర్నూలు రెవె న్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ముం దు తన ఆవేదన వ్యక్తం చేశారు.గార్గేయపురం గ్రామ రెవె న్యూ సర్వే నం.619/3లో తమ కు టుంబానికి పెద్దల నుండి వారసత్వంగా సంక్ర మించిన భూమిపై గత పది నెలలుగా న్యా యం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నామని తెలిపారు.తన భర్త మరణించిన త ర్వాత భూముల వ్యవహారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకు ని,కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి,గతంలో కొందరు రెవె న్యూ అధికారుల సహకారంతో అడంగల్, 1-బి రికార్డుల్లో అక్రమ నమోదు చేయించి,ఆ ఆధా రంగా రిజిస్ట్రేషన్లు జరిపారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై తాము ఫిర్యాదు చేయగా,కర్నూ లు రూరల్ తహసీ ల్దార్ కార్యాలయం విచార ణ జరిపి సంబంధిత రికార్డులను పరిశీలించి న అనంతరం తమ ఫోర్జరీ/ఫ్రాడ్ నమోదు అని నివేదిక పంపినట్లు తెలిపారు.అవతలి పక్షం త మ భూ హక్కులను నిరూపించే సరైన పత్రాలు సమర్పించలేదని,అయినప్పటికీ కేసును పదే పదే వాయిదా వేస్తూ తమను మానసికంగా ఇ బ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యం తం అయ్యారు.ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేసి విచారణలు నిర్వహించిన తర్వాత కూడా,తుది ఉత్తర్వులు ఇవ్వకుండా మరోసారి నోటీసు జారీ చేయడం తమకు తీవ్ర నిరాశ క లిగించిందన్నారు.నేడు ఉదయం 11:30 గంట లకు విచారణకు హాజరైనప్పటికీ,సాయంత్రం 6-00గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చిందని, ఒక మహిళగా తనకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిసారీ ఇదే పరిస్థితి అని అన్నారు.అవతలి పక్షం ఎ టువంటి బలమైన ఆధారాలు సమర్పించలేద ని,తహసీల్దార్ నివేదికలో కూడా అనేక అంశా లు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ,తుది నిర్ణయం తీ సుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అను మానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. గత నాలుగు నెలలుగా ఫైల్ ఆర్ డిఓ కార్యాల యంలో పెండింగ్‌లో ఉండగా,అంతకుముందు ఆరు నెలల పాటు తహసీల్దార్ కార్యాలయం లో విచారణ జరిగిందని,మొత్తంగా పది నెల లుగా న్యాయం కోసం తిరుగుతున్నప్పటికీ ఫ లితం కనిపించడం లేదని చెప్పారు.ఒక ఫోర్జరీ నమోదు తొలగించడానికి ఇంత సమయం ఎం దుకు పడుతోంది? ఆధారాలు లేని వ్యక్తులకు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు?" అని ఆమె ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ ను సూటి గా ప్రశ్నించారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ఉపశమనం లభించలేదని తెలిపా రు.కబ్జాదారులకు లొంగిపోయి,ప్రజలను ఇ బ్బందులకు గురి చేసే అధికారులపై రాష్ట్ర కూ టమి ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని,ముఖ్యమంత్రి జోక్యం చేసుకు ని తమకు న్యాయం చేయాలని బైరెడ్డి హరిత విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బాధిత కు టుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment