కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి...హంద్రీ పరివా హక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీ...
కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి
హంద్రీ పరివాహక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో భారీ ర్యాలీ
కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలని కోరుతూ హంద్రీ పరివాహక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో క ల్లూరు మండలం,గ్రామాల రైతులు సోమవారం జిల్లా పరిషత్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాల యం వరకు ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ చేప ట్టారు.అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్బంగా కల్లూరు మండలం,హంద్రీ పరి వాహక పరిరక్షణ కమిటీ నాయకులు బొల్లవ రం ఎన్.రమణా రెడ్డి,పి.వి.రమణా రెడ్డి,పుసు లూరు కృష్ణారెడ్డి,బస్తిపాడు కృష్ణారెడ్డి,రేమడూ రు శేఖర్,చిన్నటేకూరు ఆంజనేయులు,అను గొండ సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు.వాతావర ణంలోని ఎలినినో పరిస్థితుల వల్ల గత నలభై రోజులుగా కురువ వలసిన వర్షాలు రాలేదు. రావలసిన ఋతుపవనాలు మందగించడం వ ల్ల, జులై నెల ఆఖరు వరకు కూడా వర్షాలు కు రిసే వాతావరణ స్థితి కనిపించడం లేదన్నా రు.ఇప్పటికే వేసిన విత్తనాలు సరిగా మొలకె త్తలేదు.వచ్చిన మొక్కలను బిందెలతో చారెడు నీళ్లు పోసి,బతికించు కోవాలని చూస్తున్నా,అ దికూడా సాధ్యం కావడం లేదని అన్నారు.మ నుషులకు, పశువులకు తాగునీరు కరువైన దు ర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు.కొన్ని గ్రామాలలో తాగునీటి కొరకు పడరాని పాట్లు పడుతున్నారు.తీవ్ర తాగునీటి సమస్యల నుం డి ప్రజలను ఆదుకోవడానికి,ప్రభుత్వ యం త్రాంగం చేస్తున్న అరకొర చర్యలు ఏ మాత్రం ఉపశమనం కలిగించడం లేదన్నారు.ఈ పరి స్థితులలో గాజుల దిన్నె ప్రాజెక్ట్ నీళ్లను గేట్లు ఎత్తి,హంద్రీ నదిలోకి వదలడమే ఏకైక మార్గం అన్నారు.ప్రస్తుత దుర్భిక్ష పరిస్థితులో సాగుకు నీరు వదలడం కంటే,తాగునీటిని సరఫరా చే యడం మానవత్వం,కనీస ధర్మం అని పేర్కొ న్నారు.కావున ప్రభుత్వం తక్షణమే గాజుల ది న్నె ప్రాజెక్ట్ నీళ్లను గేట్లు ఎత్తి,హంద్రీ నదికి నీటి ని విడుదల చేయాలనీ వారు డిమాండ్ చేశా రు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండలాల రై తులు,మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Comments
Post a Comment