సమస్యలు పరిష్కరంకోసం 29వ వార్డులో సిపిఐ పర్యటన...
సమస్యలు పరిష్కరంకోసం 29వ వార్డులో సిపిఐ పర్యటన
కర్నూలు నగరంలోని 29వ వార్డులో స మస్య లు పరిష్కరించాలని సిపిఐ నగర సహాయ కా ర్యదర్శి దంభోళం శ్రీనివాసరావు డిమాండ్ చే శారు.ఈ మేరకు గురువారం కర్నూలు మున్సి పల్ కార్పొరేషన్ పరిధి,29వ వార్డులో సప్తగిరి కాలనీ సాయినాథ్ నగర్,బాలాజీ నగర్ లో డి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యటించారు.ఈ సందర్బంగా డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డ్ ప్రాంతాల్లో రోడ్డుపై మురుగునీరు ప్రవ హించి,వచ్చిపోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నట్లు చెప్పారు.వార్డ్ లో సరైన డ్రైనే జీ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్డుపైన మురుగు నీరు నిలిచి,దోమలకు నిలయంగా మారింద న్నారు.ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తరచూ డెంగ్యూ,మలేరియా,స్కిన్ ఎలర్జీలాంటి అనా రోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందా రు.కావున వార్డ్ లో తక్షణమే డ్రైనేజీ సిస్టం ఏ ర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సం దర్బంగా డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యా లయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీం,లక్ష్మి,గణేష్ రెడ్డి,ఎఆర్ కె నాయుడు,సుధాకర్,నారాయణ మ్మ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment