ఆస్తుల కోసం మానవత్వం మరిచిన కుటుంబ సభ్యులు...వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహ రించాలి...ఎస్సై వెంకట్ సూచన...
ఆస్తుల కోసం మానవత్వం మరిచిన కుటుంబ సభ్యులు
వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి ఎస్సై వెంకట్ సూచన
మంగళగిరి మండలం,నవులూరు గ్రామ పరి ధిలోని పశువుల ఆస్పత్రి సమీపంలో అవ్వారు నాగేశ్వరరావు అనే వృద్ధుడు నిరాశ్రయ స్థితి లో ఉండటం స్థానికులకు కనిపించింది.ఒంట రిగా బాధాకర పరిస్థితుల్లో ఉన్న వృద్ధుడిని గ మనించిన సచివాలయ పోలీసు సిబ్బంది,నవు లూరు గ్రామ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్,వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీ సులకు స మాచారం అందించారు.సమాచా రం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చి రు మామిళ్ల వెంకట్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడి పరిస్థితిని పరిశీలించారు. నాగేశ్వరరావుతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించగా...కుటుంబ సభ్యులు ఆయన పేరు న్న ఆస్తులను తమ పేర్లకు రాయించుకుని,అ నంతరం ఇంటి నుంచి బయటకు పంపించిన ట్లు తెలిసింది.ఈ ఘటనపై స్పందించిన ఎస్ఐ వెంకట్,వృ ద్ధుడి కుటుంబ సభ్యులను సంప్ర దించి వారితో మాట్లాడారు.వృద్ధుడిని నిర్లక్ష్యం చేయకుండా సంరక్షించాల్సిన బాధ్యత కుటుం బ సభ్యులదేనని వారికి సూచిం చారు.అనం తరం నాగేశ్వరరావును సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.వృద్ధులను నిర్లక్ష్యం చేయడం, ఆస్తుల కోసం వేధింపులకు గురిచే యడం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నా రు.కుటుంబ సభ్యులు పెద్దలను గౌరవంగా చూసుకోవాలని,ఇలాంటి ఘటనలు పున:రా వృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించాల ని ఎస్ఐ వెంకట్ సూచించారు.
Comments
Post a Comment