ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు ఇంటింటి సర్వే...
ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు ఇంటింటి సర్వే
అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా కల్పిం చడమే లక్ష్యం
సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి 'లోగో'తో కూడిన స్టిక్కర్
జూన్ 2-12 వరకు 'ప్రజాపాలన' ముగిం పు వేడుకలు
అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం ఆ దేశాలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అ మలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారు లను ఆదేశించింది.అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నదే ప్ర భుత్వ సంకల్పమని వెల్లడించింది.సచివాల యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్య క్షతన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు ఎన్.ఉత్తమ్,దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ జీవిత బీమా పథకంతోపాటు జూన్,2 నుంచి 12 వరకు రా ష్ట్ర స్థాయిలో చేపట్టనున్న 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' ము గింపు కార్యక్రమంపై సబ్ కమిటీ చర్చించింది.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సా మాజిక భద్రతను కల్పించడమే ధ్యేయంగా ప్ర భుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప థకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపింది.ఇందుకోసం రాష్ట్రవ్యా ప్తంగా సమగ్ర గృహస్థాయి డేటాను సేకరించాలని ఆదేశించింది.ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే...అలాంటి వారి కోసం ప్రత్యేక శిబి రాలను నిర్వహించాలని సూచించింది.పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎ త్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లని ఆదేశించింది.సర్వే పూర్తయిన ప్రతి ఇంటి కి ప్రత్యేక లోగోతో కూడిన స్టిక్కర్లను అతికిం చాలని సూచించింది.కాగా,రాష్ట్రంలో ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన 99 రోజుల 'ప్రజాపాలన-ప్రగ తి ప్రణాళిక' కార్యక్రమం విజయవంతం కావ డంతో జూన్,2 నుంచి 12 వరకు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికా రులను కమిటీ ఆదేశించింది.ఇప్పటివరకు ని ర్వహించిన 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కా ర్యక్రమ ప్రగతిని కమిటీ సమీక్షించింది. జూన్,2 నుంచి 12,వరకు పర్యావరణ వారోత్సవం,రో డ్డు భద్రత,మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రచా రం,మహిళా-శిశు రక్షణ,గృహ నిర్మాణం,పర్యా టక ప్రోత్సాహక కార్యక్రమాలతోపాటు పట్టణా భివృద్ధి,హరిత ఇంధన ప్రాజెక్టుల శంకుస్థాపన లు,ప్రా రంభోత్సవాలను నిర్వహించాలని సూ చించింది.అన్ని శాఖలు సమన్వయంతో పనిచే యాలని ఆదేశించింది.
Comments
Post a Comment