కేరళ ప్రతిపక్ష నేత పీనరయి విజయన్ ఇంటిపై ఈడి దాడులను ఖండించండి...సిపిఎం విజ్ఞప్తి..

కేరళ ప్రతిపక్ష నేత పీనరయి విజయన్ ఇంటిపై ఈడి దాడులను ఖండించండి

సిపిఎం విజ్ఞప్తి
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి,మే,28 :

కేరళ ప్రతిపక్ష నేత సిపిఎం పార్టీ పోలిట్ బ్యూ రో సభ్యులు పినరయి విజయన్ ఇంటిపై ఈడి సోదాలను ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యం లో గురువారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగిం ది.ఈ సందర్భంగా సి.పి.ఎం.ఓల్డ్ సిటీ కార్యద ర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో  సి పిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్,సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ.ఎస్.రా ధాకృష్ణ మాట్లాడుతూ కేరళ మాజీ ముఖ్య మంత్రి ప్రతిపక్ష నేత విజయన్ ఇంటిపై ఈడి సోదాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూ ని చేయడమేనని విమర్శించారు.దీని వెనకాల బిజెపి కుట్ర దాగి ఉందని,ఇలాంటి పని చేయ డంలో బిజెపికి కొత్తేమీ కాదని తెలియజేశా రు.ప్రజాసేవకే అంకితమై అహర్నిశలు కేరళ రా ష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి,పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన విజయన్ ఇంటిపై,ఆయ న కూతురు,అల్లుడి ఇళ్లపై, ఆయన బంధువు ల ఇళ్లపై ఈడి సోదాలు చేయడం హాస్యాస్ప దం అని ఏద్దేవా చేశారు.బిజెపి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించే ఎన్ ఫోర్స్ మెంట్, ఈడిలాంటి అధికారులను దేశ ప్రజలు ఏదో ఒక రోజు ప్రజల చేతిలో హీనంగా చూస్తారని హెచ్చరించారు.నీతి,నిజాయితీకి మారుపేరైన కమ్యూనిస్టుల ఇళ్లపై సోదాలకు దిగితే వారి ఇళ్లలో ఏమి దొరకదని చెప్పారు.బిజెపికి చిత్త శుద్ధి ఉంటే దేశంలోని బ్యాంక్ లను కొల్లగొట్టి, విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న దేశ ద్రోహులను తక్షణమే అరెస్ట్ చేయాలి,వారు కొల్లగొట్టిన డ బ్బును స్వాదీనం చేసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాని  ప్రజా సంరక్షణ కోసం నిరంతరం కృషి చే స్తున్న వామపక్షాలపై కుట్ర రాజకీయా లు ప్రదర్శిస్తే,దేశ ప్రజలు సహించలేరని అన్నా రు.అవినీతికి మారుపేరైన బిజెపి పాలకుల బా గోతం ఏదో ఒక రోజు బహిర్గతం అ వుతుంద ని,ఆ రోజు దేశంలో బిజెపి పార్టీ అవినీతి నా యకుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని బి జెపి పార్టీ నాయకులను హెచ్చరించారు.అది కూడా అతిత్వరలో ఉందని అన్నారు.నేడు బి జెపి వ్యవహారం దొంగే దొంగ,దొంగ అన్న సామె తలా ఉందన్నారు.నిజాయితీ పరులైన క మ్యూనిస్టు నాయకులపై ఈడి సోదాలు జరి పించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమ ర్శించారు.నిన్న కాక మొన్న ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేం ద్ అధికారి గురించి అవినీతిపరుడు లంచగొం డి అని గతంలో విమర్శలు చేసి న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,ప్రస్తుతం అతనికి క్లీన్ చీట్ ఇచ్చి బిజెపిలో చేర్చుకోవడమే కాకుండా ముఖ్యమంత్రిని చేయడం దేశ ప్రజలు చూస్తూ నే ఉన్నారన్నారు.తమ చెప్పు చేతుల్లో పెట్టు కున్న దగుల్బాజీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సోదాలు చేయించి,కుట్ర రాజకీయాలు చేస్తే,సి పిఎం సమాజం తిరగభడుంతుందని చెప్పా రు.ఈ దేశంలో అవినీతి మరకలు లేని పార్టీ ఏ దైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అని గుర్తు చేశారు.సిపిఎం పా ర్టీ మాజీ ముఖ్యమంత్రులకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేవన్నారు.అదేవిదంగా తమ బీ జేపీ పార్టీ పాలన సాగించే రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఆస్తులపై ప్రత్యేక ఈడీ ఏర్పాటు చేసి,వారి ఆస్తులను ప్రజలకు అంకితం చేసే దై ర్యం బిజెపి పార్టీకి ఉందా అని ప్రశ్నించారు.ఒక వేళ ఉంటే...అలాంటి ప్రయత్నం చేసి దేశ ప్రజ లకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పిల్లలు పుడి తే స్వార్థం పెరుగుతుందని ఆపరేషన్ చేయిం చుకుని ప్రజాసేవకే అంకితమైన,తన వాటాగా వచ్చిన భూమిని పేదలకు పంచిన సుందర య్యలాంటి మహానీయుల సిద్ధాంతం కోసం నిరంతరం కృషి చేసిన సిపిఎం నాయకుల త్యాగం ఎనలే నిదని కొనియాడారు.అనేక ప ర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసి సొంత ఇల్లులేని మాణిక్ సర్కార్,నృపేన్ చక్రవర్తి లాం టి వాళ్ళు అనేక త్యాగాలు చేసి ఆదర్శంగా ని లిచిన వారి అడుగుజాడల్లో నడిచిన పీనరై వి జయన్ లాంటి వారి జోలికి వస్తే దేశ ప్రజలు క్షమించరని హెచ్చరించారు.ఈ దేశంలో నల్ల డబ్బులు వెతికి తీసి,ప్రజల ఖాతాలో జమ చే స్తానని,గొప్పలు చేప్పిన నరేంద్ర మోడి,మీ కల్ల బొల్లి మాటలు ప్రజలు గమనిస్తున్నారని,నీ హంగు హార్భాటాలు,నీ విలాసవంతమైన జీవి తం ప్రజాధనాన్ని ఏరకంగా దుర్వినియోగం చే స్తున్నావో ప్రజలకు తెలియదని అనుకోవడం నీ పొరపాటని,ఏదో ఒక రోజు దానికి మూల్యం చెల్లించక తప్పదని,అటువంటి నీవా కమ్యూ నిస్టు నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తో సోధాలు చేయించేది అని దుయ్యబట్టారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుల జీవితాలు ప్రాణ త్యాగాలతో కూడుకున్నవని,ప్రజల కోసం ప్రా ణాలర్పించే చరిత్రగలవారని,అందుకు సాక్ష్యం బషీర్బాగ్ విద్యుత్ పోరాటం,ఇళ్ల స్థలాలకై ఉ ద్యమించి ప్రాణాలర్పించిన ముదిగొండ వీరు లు అని గుర్తుచేశారు.అలాంటి సిద్ధాంతం పా టించే పార్టీలో ఎక్కడైనా ఒక నాయకుడు అవి నీతికి పాల్పడినట్లు తెలిస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాక,తగిన మూల్యం చెల్లిం చాల్సిందేనని పేర్కొన్నారు.కావున ఇప్పటికై నా ఎన్ఫోర్స్మెంట్ ఈడి అధికారులు తమ వృ తి ధర్మాన్ని పాటించాలి,కానీ ఒక రాజకీయ పా ర్టీ అనుచరులుగా వ్యవహరిస్తే సిపిఎం తగిన పోరాటం సాగిస్తుందని చెప్పారు.ఈ కార్యక్ర మంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు టి.రాముడు,కే.వీ.నారాయణ,ఎం.డి. ఆనంద్ బా బు,పార్టీ నగర కమిటీ సభ్యులు ఎం.విజ య్,ఎస్.ఎం.డి.షరీఫ్,కే.రామకృష్ణ, నర సింహులు,రాధాకృష్ణ,అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్ష,కార్యద ర్శులు అరుణమ్మ,శ్యామలమ్మ,సుజాత,రజక సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్,శేషాద్రి,శ్రీ ను,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...