ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను కేవలం యంత్రాల్లా చూస్తున్నాడు...ఎస్.వి.విజయ మనోహరి,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్...
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను కేవలం యంత్రాల్లా చూస్తున్నాడు
ఎస్.వి.విజయ మనోహరి,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళ లను కేవలం యంత్రాల్లా మాత్రమే చూస్తున్నారని వై ఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.వి.విజయ మనోహరి విమర్శిం చారు.ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లా డుతూ ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి,అధికారంలోకి వచ్చిన తర్వాత వా టిని అమలు చేయకుండా మోసం చేస్తు న్నారని ఆమె మండిపడ్డారు.“ఉచిత బస్సు” పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ 16 స ర్వీసుల్లో కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి,మిగ తా సర్వీసులను మహిళలకు అందకుండా చే స్తున్నారని ఆరోపించారు.అలాగే ప్రతి మహి ళకు నెలకు రూ.1500 “ఆడబిడ్డ నిధి” ఇస్తా మని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు.ఉచిత బస్సు పథకాన్ని క్రమం గా ఎత్తివేయడానికి కూటమి ప్రభుత్వం ఎల క్ట్రిక్ బస్సులను తీసుకొస్తోందని ఆమె ఆరోపిం చారు.ఇప్పటికైనా మహిళ లు చంద్రబాబు ప్ర భుత్వ మోసాలను గుర్తించి తగిన బుద్ధి చెప్పా లని ఎస్.వి.విజయ మనోహరి పిలుపునిచ్చా రు.ఈ కార్య క్రమంలో సిద్ధారెడ్డి రేణుక,మంజు లత,హర్షయ ఫారహీన్,మంగమ్మ,భారతి,కమ ల,కాంతమ్మ,లలితమ్మ,రమీజాబి,మహిళా కా ర్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment