బిల్లుల క్లియరెన్స్‌కు లంచం...ఏసీబీ వలలో పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్...
బిల్లుల క్లియరెన్స్‌కు లంచం
ఏసీబీ వలలో పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్
అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప దేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు అధికారు లు మాత్రం లంచాల వ్యవహారాలకు తెరదిం చటం లేదు.తాజాగా జనగామ జిల్లా,పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది.సమాచారం ప్రకారం,ఓ బిల్లుల సంతకం కోసం రూ.50వేల లంచం డి మాండ్ చేయడంతో పెద్దవంగర మండలం,క న్వాయిగూడెం గ్రామానికి చెందిన బాధిత కాం ట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఫి ర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధి కారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించా రు.ఈ క్రమంలో హనుమకొండలోని భవానీ నగ ర్‌లో ఉన్న తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండ గా పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ట్రాప్ అనంతరం అధికారులు శ్రీకాంత్‌ను అదు పులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపట్టా రు.అనం తరం భవానీ నగర్‌లోని ఆయన ని వాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు.నగదు,బ్యాంకు పత్రాలు,ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు,ఇతర కీలక ఆ ధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇరి గేషన్ శాఖలో కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్, టెక్నికల్ అనుమతులు,పనుల కొలతలు,ఫైళ్ల ఆమోదాల్లో అవినీతి ఆరోపణలు తరచూ వి నిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రా ధాన్యత సంతరించుకుంది.ప్రభుత్వ పనులు పూర్తిచేసిన తర్వాత కూడా బిల్లుల కోసం కాం ట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వ స్తోందన్న విమర్శలు ఉన్నాయి.ఈ ఘటనతో హనుమకొండ జిల్లాలో కలకలం రేగగా,ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment