బాపట్లలో దొంగల బీభత్సం...

బాపట్లలో దొంగల బీభత్సం
ప్రజా చరిత్ర న్యూస్,బాపట్ల ప్రతినిధి :

బాపట్ల రైలుపేట ప్రాంతంలో దొంగలు రెచ్చి పోయారు.స్థానికుడు సయ్యద్ అన్వర్ పాషా కుటుంబ సభ్యులు బక్రీద్ పండుగ సందర్భం గా నరసరావుపేటలోని అత్త వారింటికి వెళ్లా రు.బుధవారం ఉదయం స్కూల్‌లో పని ఉం డటంతో కుమారుడితో కలిసి ఇంటికి వచ్చా రు.అయితే ముందు తలుపు తెరుచుకోక పోవ డంతో వెనుక వై పు వెళ్లి చూడగా తలుపు తెరి చి ఉండటం గమనించారు.అనుమానం వచ్చి లో పలికి వెళ్లి చూడగా బీరువాలు,కబోర్డు లు పగలగొట్టి ఉండగా…ఇంట్లో సామాను మొత్తం చెల్లాచెదురుగా పడివుంది.కొంత నగదు,ల్యాప్‌ టాప్‌తో పాటు మరికొన్ని విలువైన వస్తువులు దొంగలు అపహరించి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు.ఇటీవల బాపట్లలో వరుస చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచాలని ప్రజలు కోరుతున్నా రు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...