ప్రేమికుడి స్నేహితుడితో శృంగారానికి నిరాకరణ...బాలిక దారుణ హత్య...
ప్రేమికుడి స్నేహితుడితో శృంగారానికి నిరాకరణ
బాలిక దారుణ హత్య
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్,పడ్రి ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి,ఆపై దారు ణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వ చ్చింది.బాలిక శరీరంపై ముక్కు,పెదవులు,మె డ భాగాల్లో తీవ్రమైన గాయాలు ఉండటంతో, నిందితులు ఆమెను ఎంతటి పాశవికంగా హ తమార్చారో స్పష్టమవుతోంది.ఈ ఘటనలో ప్రే మికుడితో పాటు అతని స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.బాలిక తన వదిన తో కలిసి శనివారం రాత్రి పడుకుంది.అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఆమె అదృశ్య మైంది.కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. ఉదయం ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొడి కాలువలో ఆమె మృతదేహం కనిపించింది.ఆ బాలికను సుఖనై గ్రామా నికి చెందిన సాజన్ (ప్రేమికుడు),అజ య్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధా రించారు.ఘటన పట్ల ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం,సాజన్ బాలికను రాత్రిపూట బయటకు పిలిపించాడు.ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి సాజన్ ముందుగా ఆమెపై అత్యాచారం చేశాడు.ఆ తర్వాత తన స్నేహి తుడైన అజయ్ కూడా శృంగారంలో పాల్గొనా లని బాలికపై ఒత్తిడి తెచ్చాడు.బాలిక తీవ్రంగా ప్రతి ఘ టించడంతో,ఆగ్రహానికి గురైన ఇద్దరు నిం దితులు ఆమెను కొట్టి,గొంతు నులిమి హ త్య చేశారు.ఈ నేపథ్యంలో ప్రధాన నింది తు డు సాజన్ ను పోలీసులు అతని ఇంట్లోనే అ రెస్టు చేశారు.విచారణలో అతను అజయ్ పే రును వెల్లడించాడు.అజయ్ ను పట్టుకునే క్ర మంలో పోలీసులపై అతను కాల్పులు జరిపా డు.పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అజయ్ ఎడమ కాలికి బుల్లెట్ తగలడంతో అతను గాయపడ్డాడు.ప్రస్తుతం అతను ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నలుగు రు పిల్లల్లో ఆ బాలికే చిన్నది.ఆమె తండ్రి ఆ ర్కెస్ట్రా నిర్వాహకుడు.గత శనివారం రాత్రి ఆయన ఒక కార్యక్రమం కోసం వేరే గ్రామానికి వెళ్లగా,ఈ దారుణం జరిగింది.కుమార్తె మృత దేహాన్ని చూడగానే తల్లి స్పృహ తప్పి పడిపో యింది.నిందితుడిని గతంలోనే తాము హెచ్చ రించామని,అయినా అతను వినకుండా తమ బిడ్డను పొట్ట నబెట్టుకున్నాడని తల్లి విలపిం చింది.ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగి స్తున్నారు.
Comments
Post a Comment