ఒక పూట భోజనం...కిలోమీటర్ల కొద్దీ నడక... రూపాయి పతనంతో విదేశీ విద్యార్థులకు కష్టాలు...
ఒక పూట భోజనం...కిలోమీటర్ల కొద్దీ నడక
రూపాయి పతనంతో విదేశీ విద్యార్థులకు కష్టాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం అనేది ఎక్కువగా చమురు దిగుమ తులు,స్టాక్ మార్కెట్లు,వాణిజ్యలోటు కోణంలోనే చర్చకు వస్తుంది.కానీ విదేశీ డిగ్రీ,చదువు తర్వాత మం చి ఆదాయం సంపాదించాలనే కలలతో ఇండ్ల ను వదిలివెళ్లిన లక్షలాది భారతీయ విద్యార్థు లను సైతం ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదువు కంటే ఎక్కువగా రోజులు ఎలా గడ పాలన్న ఆలోచనలతో విద్యార్థులు సతమత మవుతున్నారు.బలహీనపడుతున్న రూపా యి విలువ విదేశాల్లో ఉన్న అనేక మంది భార తీయ విద్యార్థులను బతకడానికి బడ్జెట్ వేసు కునేలా చేసింది.అధికారిక పార్ట్ టైమ్ షిఫ్ట్ ల తోపాటు డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు,రైల్వేస్టేషన్ల లో ఫ్లోర్‌లను తుడవడం వంటి కష్టతరమైన పనులు చేయడం నుంచి,రోజుకు ఒక పూట మాత్రమే తింటూ జీవించడం లేదా అసలు భో జనమే మానేయడం వరకు...పతనమవుతు న్న రూపాయి మధ్య విదేశాలలో చదువుకోవ డం అనేది చాలా కఠినంగా మారింది.విపరీత మైన సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవా రు తప్ప మిగిలిన చాలామంది పరిస్థితి ఇదే. భోజనాలు మానేస్తూ కేవలం మనుగడ కోస మే నిరంతరం పోరాడుతున్నప్పుడు ఇక చదు వులు పూర్తిస్థాయిలో అమలు ప్రశ్నార్థకమే.
Comments
Post a Comment