అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం...

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం
ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,మే,25 :

తప్పిపోయిన పిల్లల,అపహరణకు గురైన పిల్ల ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం అంతర్జాతీయంగా ఈ దినోత్సవం జరుపుకుం టారు.2001నుండి ఆరు ఖండాలలోని ఎరవైకి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని పురస్కరించు కుని అవగాహ నా కార్యక్రమాలు,తల్లిదండ్రు లు,పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,స్వచ్చం ద సంస్థలు,ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై సెమినార్లు,ప్రదర్శనలు వంటి కార్య క్ర మాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు.1998లో యునైటెడ్ స్టేట్స్ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్లోయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ ప్రారంభించబడింది.పిల్లల అపహ రణ,పిల్లలపై లైంగిక వేధింపులు,పిల్లలు దోపి డీకి గురవ్వకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న స్వ చ్చంద సంస్థ ఇది.ఇరవై తొమ్మిది దేశాలు ఈ సంస్థ పరిదిలో పనిచేస్తున్నాయి.తప్పిపోయిన పిల్లలను వెతికి వారి కుటుంబాలకు తిరిగి కలి పే ఆశను సూచించే ఫేర్గెట్మినాట్ అనే పువ్వు ను ఈ రోజుకు ప్రతీకగా ఉపయోగిస్తారు.గత వారం క్రితం సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లకు తప్పిపోయిన పిల్లల గురించి తప్పక ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని,ప్రత్యేక బృందా లు,నిఘా ఏర్పాటు చేసి డెబ్భై వేల మంది పి ల్లల ఆచూకీ కనుగొనాలని,బాలల అక్రమ ర వాణాను అరికట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాలు ,స్వచ్చంద సంస్థలు ప్రత్యేక నిఘా విభాగాలు,బృందాలు ఏర్పాటు చేసి బాలల అపహరణకు అరికట్టాలి.ప్రజలందరూ చైతన్య వంతంగా పిల్లలు అపహరణకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల అపహణకు సం బంధించి 1098 ఫ్రీ కాల్ నెంబర్ (చైల్డ్ లైన్ ) కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.భారత దే శంలో ప్రతీ ఏటా 98,000మంది పిల్లలు అప హరణకు గురవుతున్నారని ఒక అంచనా.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...