వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా తెలుగు దేశం పార్టీ చరిత్ర...మహానాడుపై తీవ్ర విమర్శ లు...ఎస్.వి.మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ కర్నూ లు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే,కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త...

వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ చరిత్ర

మహానాడుపై తీవ్ర విమర్శలు

ఎస్.వి.మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే,కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి :

వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీక తెలు గుదే శం పార్టీ చరిత్ర అని ప్రస్తుతం జరుగుతున్న మ హానాడుపై వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్య క్షుడు,మాజీ ఎమ్మె ల్యే,కర్నూలు నియోజక వర్గ సమన్వయ కర్త ఎస్.వి.మోహన్ రెడ్డి తీవ్ర వి మర్శలు చేశారు.ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.టీడీపీని వెన్నుపో టు పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. మహానాడు కార్యక్రమం ప్రజా సమస్యలు,ఎ న్నికల హామీల అమలుపై చర్చించడానికి కా కుండా,వైఎస్ ఆర్సీపీ,మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే పరి మితమైందని విమర్శించారు.వైఎస్ఆర్సీపీ గొ డవలు,కక్షసాధింపుల రాజకీయాలు చేసే పార్టీ కాదని,సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితా ల్లో మార్పు తీసుకువచ్చిన పార్టీ అని పేర్కొ న్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్నికల సమయంలో మహిళలు,రైతులు, యువత,నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి న టీడీపీ ప్రభుత్వం,అధికారంలోకి వచ్చిన త ర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన టీడీపీ నాయకులు,మహానాడు వేదికగా ప్రతి పక్షాలపై విమర్శలు చేయడానికే పరిమితమ వుతున్నారని అన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూ పించుకోవాలని,విమర్శల రాజకీయాలను విడ నాడి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సా రించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశా రు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...