11వివాహాలు...18మంది మహిళలతో శారీరక సంబంధం...
11వివాహాలు...18మంది మహిళలతో శారీరక సంబంధం
బెంగళూరు జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలుకా లో వివాహిత మహిళలను లక్ష్యంగా చేసుకు ని,వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం,దా నిని వీడియో తీయడం,వారిని బ్లాక్‌మెయిల్ చే యడం వంటి తీవ్ర మైన ఆరోపణలపై బెంగళూ రు రూరల్ జిల్లాలోని ఆనేకల్ తాలూకా సర్జా పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేష్ అనే వ్యక్తి పై కేసు నమోదైంది.పోలీసు వర్గాల సమాచా రం ప్రకారం నిందితుడు రాకేష్ ఒక మంచి వ్య క్తిగా పరిచయం చేసుకుని మహిళల నమ్మకా న్ని పొందేవాడని తెలిసింది.ఆ తర్వాత అత ను వారితో శారీరక సంబంధం పెట్టుకుని,దాని ని వీడియో తీసి,వారి ని బెదిరించినట్లు ఆరో పణలు ఉన్నాయి.అతనికి సుమారు 18మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని,అనేక వివాహా లు చేసుకున్నాడని కూడా కేసులో ఆ రోపణలు ఉన్నాయి.కాగా ఫిబ్రవరి,22న హె బ్బగోడికి చెందిన భవ్య అనే యువతిని వివా హం చేసుకున్న రాకేష్,పెళ్లయిన కొద్దిరోజులకే కోటి వరకట్నం కోసం ఆమెను వేధించాడని ఆ రోపిస్తూ ఒక ఫిర్యాదు దాఖలైంది.అతని గత సంబంధాలు,ఆరోపిత వీడియోల గురించి భా ర్యకు తెలియగానే,ఆమెపై పెట్రోల్ పోసి హ త్యాయత్నం చేశాడని కూడా ఆరోపణలు ఉ న్నాయి.వరకట్నం వేధింపులు,ప్రాణహాని,ఇతర ఆరో పణలపై సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అతను పలువురు మహిళలతో సంబంధాలు కలిగి ఉ న్నాడనే ఆరోపణలపై ఉన్న వీడియోలు కూ డా దర్యాప్తులో భాగంగా ఉన్నాయని తెలిసిం ది.
Comments
Post a Comment