ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత... 1200 మంది పోలీసులతో బందోబస్తు... పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండా లి...కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత
1200 మంది పోలీసులతో బందోబస్తు
పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఈ నెల 24వ తేదీన పత్తి కొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో ఉన్న జి యో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సందర్శిం చనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ విస్తృ త భద్రతా ఏర్పాట్లు చేసింది.ముఖ్యమంత్రి ప ర్యటన సందర్భంగా హెలిప్యాడ్,సభా ప్రాంగ ణం తదితర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏనేటి ర్పాటు చేశారు.బందోబస్తు విధుల నిమిత్తం వి విధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికా రులు,సిబ్బందికి మంగళవారం జొన్నగిరి పోలీ స్ స్టేషన్ పరిధిలోని పగిడిరాయి గ్రామంలో గో ల్డ్ మైన్స్ సమీపంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటి ల్ దిశానిర్దేశం చేశారు.1,200 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించారు.వీ రిలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు,14మంది డీఎస్పీలు,40మంది సీఐలు,76మంది ఎస్సై లు,300మంది ఏఆర్,ఏపీఎస్పీ,స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు.విధుల్లో ఉన్న అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా వ్య వహరించి ఎలాంటి అ వాంఛనీయ సంఘట నలకు తావులేకుండా విధులు నిర్వహించా ల ని ఎస్పీ ఆదేశించారు.భద్రతా చర్యలను సమ న్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజ యవంతం చేయాలని సూచించారు.ఈ కార్య క్రమంలో కర్నూలు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా,కడప అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు,నంద్యాల అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ,సీ ఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,ఆర్ ఎస్ఐలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment