ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 121 ఫి ర్యాదులు...విచారణ జరిపి చట్టపరంగా న్యా యం చేస్తాం...కర్నూలు డిఎస్పీ రాఘవేంద్ర...

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 121 ఫిర్యాదులు

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

కర్నూలు డిఎస్పీ రాఘవేంద్ర
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,22 :

కర్నూలు కొత్తపేట,రెండవ పట్టణ పోలీస్ స్టేష న్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయం లో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ రాఘవేంద్ర సోమవా రం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమ స్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారుల తో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి నేడు మొత్తం 12ఫిర్యా దులు వచ్చాయి.ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్ర కారం విచారణ జరిపి,బాధితులకు న్యాయం చేస్తా మని,సమస్యలను త్వరితగతిన పరిష్క రిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు డిఎస్పీ రాఘవేంద్ర హామీ ఇచ్చారు.
 
వచ్చిన ఫిర్యాదుల్లో ...

1) కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో నెల కు రూ.38వేల జీతంతో స్టాప్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి,కర్నూలు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో పని చేసే ఎ ర్రవల్లి వేణు రూ.5.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు,శ్రీ రామ్ నగర్ కు చెందిన సుప్రియ పిర్యాదు చేశారు.

2) పొలం ఆక్రమించుకోవాలని కొట్టి గాయప రిచిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవన కొండ మండలం,తెర్నెకల్లు గ్రామానికి గిడ్డమ్మ ఫిర్యాదు చేశారు.

3) 10మందికి రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పి స్తామని చెప్పి మోసం చేసిన శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు,కల్లూరుకు చెందిన గొవిందు ఫిర్యాదు చేశారు.

4) ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి,కల్లూరు మం డలం,ముజఫర్ నగర్ కు చెందిన మహబూబ్ ఎనిమిది లక్షలు తీసుకొని ఇంటి నిర్మాణం పూ ర్తి చేయకుండానే మోసం చేశాడని కర్నూలు, స్వామిరెడ్డి నగర్ కు చెందిన రామేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు.

5) కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో సూప ర్ వైజర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.1. 60లక్షలు తీసుకోని మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని గూడురు మండలం, నాగాలాపురంకు చెందిన మద్దిలేటి ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐలు శివశంకర్, పార్థసారథి,రామకృష్ణ,ప్రవీణ్ కుమార్ రెడ్డి పా ల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...