14న స్కెచ్ ఫెయిల్...18న సక్సెస్...పుణె వ్యాపార వేత్త కొడుకు మృతిపై వీడిన మిస్టరీ...

14న స్కెచ్ ఫెయిల్...18న సక్సెస్ 

పుణె వ్యాపారవేత్త కొడుకు మృతిపై వీడిన మిస్టరీ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 :

పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యా పారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (2 6) మృతి వెనుక అత్యంత భయంకరమైన కు ట్ర కోణం వెలుగులోకి వచ్చింది.జూన్,18న లో హగఢ్ కోట వద్ద కే తన్ లోయలో పడి మర ణించడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే... అంటే జూన్ 14న కూడా అతడిపై హత్యాయ త్నం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలిం ది.కాబోయే భర్తను ఎలాగైనా వదిలించుకోవా లనే పట్టుదలతో,కాబోయే భార్యే తన ప్రియు డితో కలిసి వరుసగా చేసిన రెండో ప్రయత్నం లో అతడిని అంతమొందించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.పుణె రూరల్ పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేతన్ అగర్వాల్‌కు,సియా గోయల్ (20)అనే యువ తికి ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగిం ది.నవంబర్‌లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగు తున్నాయి.అయితే,అప్పటికే చేతన్ చౌదరి (2 2) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.దీంతో కేతన్‌ను చంపేయా లని ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే జూన్,14న ఇదే లోహగ ఢ్ కోట వద్ద కేతన్‌ను కొండపై నుండి నెట్టే య డానికి ప్రయత్నించారు.అయితే ఆ సమయం లో కేతన్ అ దృష్టవశాత్తూ ఒక చెట్టు కొమ్మను లేదా బండరాయిని పట్టుకుని ప్రాణాలతో బ యటపడ్డాడు.ఆ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్న కేతన్...తనను చంపడానికే ఈ ప్రయత్నం జరిగిందని ఊహిం చలేకపోయా డు.మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ సి యా తన ప్లాన్‌ను వదల్లేదు.నాలుగు రోజుల తర్వాత,అంటే జూన్,18న తన పుట్టినరోజు వే డుకల నెపంతో కేతన్‌ను,స్నేహితులను తీసు కుని మళ్లీ అదే కోటకు వెళ్లింది.ఈసారి మరిం త పక్కాగా ప్లాన్ చేసి,ప్రియుడు చేతన్‌ను ముందే అక్కడికి రప్పించింది.కోటలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో కేతన్ ఫొటోల కోసం పోజ్ ఇస్తున్న సమయంలో...సియా,చేతన్ ఇద్దరూ కలిసి అతడిని 350-400 అడుగుల లోతు ఉన్న లోయలోకి నెట్టేశారు.బలమైన గా యాల వల్ల జరిగిన ప్రమాదంగా దీనిని చిత్రీ కరించే ప్రయత్నం చేశారు.తొలుత ప్రమాద మరణంగా భావించిన ఈ కేసును పుణె రూర ల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ నేతృత్వంలో దర్యాప్తు చేయగా అసలు నిజా లు బయటపడ్డాయి.ఘటన జరిగిన సమయం లో ముఖానికి ముసుగు ధరించి వెంబడించిన చేతన్ చౌదరి దృశ్యాలు సీసీ టీవీల్లో దొరికా యి.సాంకేతిక ఆధారాలు,కాల్ డేటాను విశ్లేషిం చిన పోలీసులు సియా గోయల్,చేతన్ చౌదరి లను అరెస్ట్ చేశారు.విచారణలో వారు తమ నేరాన్ని,అంతకు నాలుగు రోజుల ముందు చేసి న హత్యాయత్నాన్ని కూడా అంగీకరించారు. తమ సొంత కూతురిలా చూసుకున్న అమ్మా యే ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై కేతన్ తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా రు.పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే తామే గౌరవించేవాళ్లమని,ఇలా దారుణంగా చంపా ల్సిన అవసరం ఏ ముందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.నిందితులకు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...