ప్రముఖ యూట్యూబర్ కుటుంబంపై కేసు న మోదు...యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ. 15 లక్షల టోకరా...
ప్రముఖ యూట్యూబర్ కుటుంబంపై కేసు నమోదు
యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15ల క్షల టోకరా
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ఎన్టీఆర్,జూన్, 04
సోషల్ మీడియా సెలబ్రిటీల ముసుగులో జరు గుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ సంచలనం సృష్టి స్తున్నాయి.ప్రముఖ యూ ట్యూబర్, 'మన శంకర వర ప్రసాద్' ఛా నల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రమా నంద న అలియాస్ నందు కుటుంబంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.యూకే వీసా రెన్యూవల్ చే యిస్తామంటూ ఓ బాధితుడిని నమ్మించి ఏకం గా రూ.15లక్షలు నొక్కేసినట్లు ఆరోపణలు రా వడం చర్చనీయాంశంగా మారింది.వివరాలు ఇలా ఉన్నాయి...వెస్ట్ ఇబ్రహీంపట్నం ప్రాంతా నికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు గతంలో యూకేలో ఉండేవా డు.అక్కడ అతని వీసా గడువు ముగిసిపో యే సమయం దగ్గరపడటంతో,వీసా రెన్యూవ ల్ చేయించుకోవడం కోసం 'డెస్టినీ కన్సల్టెన్సీ' నిర్వాహకులను ఆశ్రయించాడు.ఇదే అదనుగా భావించిన కన్సల్టెన్సీ వాళ్లు శివక్రాంతి కుమా ర్‌కు ఆశ చూపించారు.ఇండియాలో ఉన్న త మ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బం ది లేకుండా వీసా ప్రాసెస్ పూర్తి చేస్తామని న మ్మబలికారు.వారి మాటలను నిజమేనని న మ్మిన బాధితుడు విడతల వారీగా దాదాపు రూ.15లక్షల వరకు చెల్లించాడు.డబ్బులు తీ సుకుని నెలలు గడుస్తున్నా వీసా ప్రాసెస్ పూర్తి కాలేదు.దీనిపై బాధితుడు నిందితులను నిలదీ యగా,వారి నుంచి ఎలాంటి సరైన సమాధానం రాలేదు సరే కదా...ఎదురు తిరిగారు.దీంతో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన శి వక్రాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా డు.బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఇబ్ర హీం పట్నం పోలీసులు ప్రాథమిక విచారణ జ రిపి,ఇందులో భారీ మోసం జరిగినట్లు నిర్ధారిం చారు.ఈ మేరకు 'డెస్టినీ కన్సల్టెన్సీ' నిర్వాహ కులపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో డెస్టి నీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన (నటి నందు), అ లాగే గుంటూరులో నివసిస్తున్న మధుకర్ తం డ్రిని నిందితులుగా చేర్చి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ఇలాంటి వీసా మోసాలకు పాల్పడ టం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.వి దేశాలకు వెళ్లా లనుకునే వారు,వీసా గడువు పొడిగించు కోవాలనుకునే వారు ఇలాంటి నకి లీ కన్సల్టెన్సీల బారిన పడి మోసపోవద్దని పో లీసులు సూచించారు.
Comments
Post a Comment