ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి పాటు పడ దాం...అట్టహాసంగా కర్నూలు నగరంలో ప్రపం చ ఒలంపిక్ రన్ లో పాల్గొన్న 1500 మంది క్రీ డాకారులు...

ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి పాటు పడదాం 

అట్టహాసంగా కర్నూలు నగరంలో ప్రపంచ ఒలంపిక్ 

రన్ లో పాల్గొన్న 1500మంది క్రీడాకారులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు స్పో ర్ట్స్,జూన్,24 :

ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి అను ని త్యం పాటు పడదామని ఏపీఎస్పి డి.ఎస్.పి మహబూబ్ బాషా,జిల్లా ఒలంపిక్ సంఘం కా ర్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్నమయ్యలు వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలు జి ల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఒలంపిక్ డే రన్ ను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ కృష్ణ,రో టరీ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ గుప్తా,ఆర్ ఎస్ఐ నాగస్వామి,రాయలసీమ యూనివర్సిటీ స్పో ర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శివకిషోర్,జిల్లా ఒలం పిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు,జిల్లా ఒ లంపిక్ సంఘం నాయకులు డాక్టర్ రుద్రరెడ్డి, అవినాష్ శెట్టి,ఈశ్వర్ నాయుడు,సురేష్ గౌడ్, శ్రీనివాసులు,సునీల్ కుమార్ తో పాటు క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన రన్,కి డ్స్ వరల్డ్ మీదుగా రాజువిహార్ కు చేరుకొని అక్కడి నుంచి మౌర్య ఇన్,ఆర్.ఎస్ సర్కిల్,ఎ స్ టిబిసి కళాశాల మీదుగా కర్నూలు అవుట్డో ర్ స్టేడియంకు చేరుకుంది.ఈ సందర్భంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటుచేసి న ముగింపు స భలో డీఎస్పీ మహబూబ్ బా షా మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో ప్ర తి రోజు క్రీడా సాధనకు కొంత సమయాన్ని కే టాయించి,తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని సూచించారు.ప్రపంచవ్యాప్తం గా క్రీడాకారులకే అధిక సంఖ్యలో గుర్తింపు ఉం దని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు.తల్లి దం డ్రులు తమ పిల్లలను చదువుకే పరిమితం చే యకుండా క్రీడా సాధన వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసు కోవాలన్నారు.అనంతరం కార్య నిర్వాహక అధ్యక్షులు నాగరత్నమయ్య మా ట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 28 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.ఇండియన్ ఒలంపిక్ సంఘం అధ్య క్షురాలు ఉష ఆదేశాల మేరకు కర్నూలు నగ రంలో 2036మొక్కలను నాటేందుకు ప్రణాళిక లను రూపొందించినట్లు తెలిపారు.చివరిగా అంతర్ పాఠశాలల పోటీల్లో గెలుపొందిన వి ద్యార్థులకు బహుమతులను అందించారు.రన్ లో వివిధ పాఠశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.అంతకు ముందు చి న్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్ర మాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్ర మంలో టిడిపి నేత గౌతమ్ రెడ్డి,క్రీడా సంఘాల ప్రతినిధులు పాండు రంగారెడ్డి,శ్రీధర్,రవికు మార్,మాధవరావు,లోకేష్,రమణయ్య,శ్రీరాములు యాదవ్,వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పా ల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...