ఏఎస్ పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...రూ.20వేలు లంచం తీసుకుంటూ తహ సీల్దార్ డి.ఎస్.స్వరూప్ పట్టివేత...
ఏఎస్ పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రూ.20వేలు లంచం తీసుకుంటూ తహ సీల్దార్ డి.ఎస్.స్వరూప్ పట్టివేత
ఏఎస్ పేట మండలంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ డి.ఎస్.స్వరూప్ పట్టా దారు పాస్ పుస్తకంలో పేరు మార్పు (మ్యూటే షన్) చేసేందుకు ఓ రైతు వద్ద రూ.20వేల లం చం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు వచ్చిన ఫి ర్యాదు మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీ బీ) అధికారులు శనివారం ఆకస్మికంగా దాడి చేశా రు.పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేయడానికి తహసిల్దార్ రూ.20వేలు లంచం డిమాండ్ చే సినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఏసీబీ అధికా రులను ఆశ్రయించగా,ఏసీబీ అధికారుల సూ చనల మేరకు వలపన్ని తహసిల్దార్ ను బహి రంగంగా పట్టుకున్నారు.అనంతరం ఏసీబీ అధికారులు తహసిల్దార్ కార్యాలయంలో తని ఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చే సుకున్నారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రే పింది.కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసా గుతోందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
Comments
Post a Comment