డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును,క్యాటగిరి వైజ్ కటాఫ్ మార్కులను బయట పెట్టాలి...బీఎస్పీ కర్నూలు జిల్లా ఇంచార్జి గాడి అరుణ్ కుమా ర్...

డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును,క్యాటగిరి వైజ్ కటాఫ్ మార్కులను బయట పెట్టాలి

బీఎస్పీ కర్నూలు జిల్లా ఇంచార్జి గాడి అరుణ్ కుమార్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,22 :

బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అ ధ్యక్షులు మధుకర్ ఆద్వర్యంలో "డీఎస్సీ 20 25 మెరిట్ లిస్టును,క్యాటగిరి వైజ్ కటాఫ్ మా ర్కులను" బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని బీఎస్పీ డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూ లు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అనంతరం వినతి పత్రాన్ని డిఆర్ ఓకి అందచే శారు.ఈ సందర్బంగా బీఎస్పీ కర్నూలు జిల్లా ఇంచార్జి గాడి అరుణ్ కుమార్ మాట్లాడుతూ "డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును,క్యాటగిరి వైజ్ కటాఫ్ మార్కులను" బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ డిమాండ్ చేస్తున్నట్లు చె ప్పారు.డీఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఘనత వహించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గతంలో 13డీఎస్సీలను ఎ లాంటి లోటుపాటులు లేకుండా నిక్కచ్చిగా ని ర్వహించామని చెప్పారు.నిజమే దీన్ని మేము ఎవ్వరము కాదనలేదు.కాని ఆ 13 డీఎస్సీల మెరిట్ లిస్టులను అప్పుడు బయట పెట్టారు కదా! మరి ఇప్పుడు ఎందుకు డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును బయట పెట్టలేదు.ఇందుకు ప్రధాన కార ణం ఎకనామికల్ వీకర్ సెక్సన్ (ఇ.డ బ్ల్యు.ఎస్).ఇ.డబ్ల్యు.ఎస్.అంటే ఆర్థి కంగా వెనకబడిన ఓసీ కులాలకు రిజర్వేషన్ కల్పించేది.మరి ఓసీల జనాభా ఎంత శాతం ఉందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడైనా బ యట పెట్టినాయా? పోనీ ఓసీలు ఆర్థికంగా ఎం త శాతం జనాభా వెనుకబడి ఉన్నారు అనే వి షయంపై లెక్కలు ఉన్నాయా? అంటే అవి ఏవి లేవు.కాని 10శాతం రిజర్వేషన్ అమలు చేస్తు న్నారు.ఇప్పుడు ఈ 10శాతం ఇ.డబ్ల్యు.ఎస్. పేరుతో డీఎస్సీ 2025లో అమలు చేయుట వ లన బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల మా ర్కులు కంటే ఓసీ అభ్యర్థులకు తక్కువ మా ర్కులకే టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి.అందు వలన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును,క్యాటగిరి వైజ్ కటాఫ్ మార్కులను బయట పెట్టలేదు. ఈ మెరిట్ లిస్టును బయట పెట్టితే బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల మార్కులు ఎక్కువగా ఉన్నా,తక్కువ మార్కులు వచ్చిన ఓసీ అభ్య ర్థులకు ఏ విధంగా టీచర్ ఉద్యోగాలు వస్తా యనే ప్రశ్న ఉత్పన్న మౌతుంది అన్నారు.అ ప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు మోసం,దగా చేసిందనే ఆలోచన కలుగు తుందనే దుర్మార్గమైన ఆలోచనతోనే డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును,క్యాటగిరి వైజ్ కటాఫ్ మార్కులను బయట పెట్టలేదన్నారు. కావున చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2025 మెరిట్ లిస్టును, క్యాటగిరి వైజ్ కటాఫ్ మార్కులను బహిర్గతం చేయాలనీ ఆయన డి మాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జి ల్లా ఇన్చార్జిలు వనమన్న,గాడి అరుణ్ కుమా ర్,జిల్లా అధ్యక్షులు సామేలు ఉపాధ్యక్షులు బో య రవికుమార్,కార్యదర్శి సుంకన్న,కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు మధుకర్,ఎమ్మిగనూరు అ ధ్యక్షులు బంగారప్ప,బిఎస్ఎఫ్ కన్వీనర్ హను మన్న,కోశాధికారులు సలీం భాష,సాల్మన్,కర్ణ, మధు,రఫిక్,విజయ్,పరమేష్,కార్యకర్తలు పా ల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...