చుట్టాలే కదా...గుడ్డిగా నమ్మి రూ.21లక్షలు ఇచ్చింది...డబ్బులు అడిగితే మహిళపై వేధిం పులు...

చుట్టాలే కదా...గుడ్డిగా నమ్మి రూ.21లక్ష లు ఇచ్చింది

డబ్బులు అడిగితే మహిళపై వేధింపులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,విశాఖ,జూన్, 27 :

ఆపదలో ఉన్నారని,తెలిసిన వారే కదా... అని ఆదుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగి లింది.ఆమెకు తెలియకుండానే ఆమె వీడియో లు రికార్డ్ చేసిన దుండగులు.తమకు న్యూడ్ కాల్స్ చేయకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తా మంటూ...రివర్స్‌ లో ఆమెనే బ్లాక్‌ మెయిల్ చేయడం ప్రారంభించారు.బంధు వు లని నమ్మి డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తా రా అని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నింది తులను అదుపులోకి తీసుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి...విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సా గిస్తోంది.ఆ టైలరింగ్ ద్వారా వచ్చిన డ బ్బును పొదుపు చేస్తూ ఆర్థికంగా ఎదుగు తోం ది.అయితే ఈ విషయం ఆమె సమీప బంధు వులైన చొక్కర అశోక్,వండ్రాసి శంకర్ అనే ఇద్ద రు వ్యక్తులకు తెలిసింది.దీంతో తాము కష్టాల్లో ఉన్నామని...కొంత నగదు సాయం చేయాల ని...తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమెను నమ్మబలికారు.వారి మాటలు నిజమేనని న మ్మిన ఆమె...2018లో వారికి రూ.21లక్షలు నగ దును అప్పుగా ఇచ్చింది.రోజులు గడిచా యి.నెలలు గడిచాయి.సంవత్సరాలు కూడా గడిచిపోయాయి.కానీ వాళ్లు తీసుకున్న డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేదు.దీంతో ఓ రోజు ఆమె డబ్బులు తిరిగి ఇవ్వాలని అశోక్,శంకర్‌లను అడిగింది.సరే విజయవాడకు వచ్చి డబ్బు తీసుకెళ్లమని సదరు మహిళకు చెప్పారు ఆ ఇద్దరు కేటుగాళ్లు.తీరా ఆమె అక్కడికి వెళ్లా క...ఆమె వ్యక్తిగత వీడియోను ఆమెకే చూపి స్తూ బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు.ఆ వీడియోను సోషల్ మీడిలో పోస్ట్‌ చేస్తా మని బెదిరిస్తూ ఆమెను మానసికంగా,శారీరకంగా వే ధించారు.అంతేకాకుండా,బాధితురాలి వాట్సా ప్ నంబర్‌కు అసభ్యకర వీడియోలు పంపడం తో పాటు,వాట్సాప్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేసి,బాధితురాలిని కూడా అలాంటి వీడి యో కాల్ చేయాలని బలవంతపెట్టారు.ఒకవే ళ అలా చేయకపోతే...తన వ్యక్తిగత వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బె దిరించారు.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఏం చేయాలో తెలియక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.జరిగిం దంతా చెప్పి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన పోలీసులు కేసు న మోదు చేసి...అశోక్,శంకర్రావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టే షన్‌కు తరలించారు.వారిపై పలు సె క్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...