రూ.25వేలు లంచం తీసుకున్న అధికారిని ఏసీ బీ పట్టివేత...
రూ.25వేలు లంచం తీసుకుంటున్న అధి కారిని ఏసీబీ పట్టివేత
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ముదిగొండ, జూన్,28 :
ఖమ్మం జిల్లా,ముదిగొండ మండలం,భా నాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి త మ్మిశెట్టి సురేష్.. ఫిర్యాదుదారుడి నుంచి రూ.25వేలు లంచం డిమాండ్ చేసి తీసు కుంటుండగా ఖమ్మం ఏసీబీ రేంజ్ అధికా రులు పట్టుకున్నారు.ఫిర్యాదుదారుడి ఇంటి స్థలంలో నిర్మిస్తున్న ఒక గది రేకుల షెడ్ కు భవన అనుమతి ప్రక్రియ పూర్తి చేయడం,ఇంటి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి లంచం కో రినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ముదిగొండ మండలంలోని రైతు వేదిక సమీపంలో లంచం స్వీకరిస్తుండగా అధి కారులు దాడి చేసి పట్టుకున్నారు.నింది తుడి వద్ద నుంచి లంచం సొమ్ము రూ. 25వేలు స్వాధీనం చేసుకున్నారు.అనం తరం పంచాయతీ కార్యదర్శిని అరెస్ట్ చేసి వరంగల్లోని ఎస్పీఈ,ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Comments
Post a Comment