బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన హామీలు తుంగ లో తొక్కిన కూటమి ప్రభుత్వం...జ్వాలాపురం శ్రీకాంత్,వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎండోమెంట్ అడ్వైజర్...
బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం
జ్వాలాపురం శ్రీకాంత్,వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ ఎండోమెంట్ అడ్వైజర్
బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన హామీలను కూ టమి ప్రభుత్వం తుంగలో తొక్కినట్లు వైఎస్ఆ ర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ ఎండోమెం ట్ అడ్వైజర్ జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించా రు.ఈ మేరకు బుధవారం నగరంలోని ఎస్.వి. మోహన్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల సంక్షేమం,అర్చకుల అభివృద్ధి,దే వాలయాల పరిరక్షణ పేరుతో ప్రజలను మోసం చేసి,ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో దేవాలయాల పరిస్థి తి రోజురోజుకు దిగజారుతోందని,దేవాలయా లను కూడా కూటమి ప్రభుత్వం కుల రాజకీ యాలకు వేదికగా మార్చిందని విమర్శించారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో మాటలు చె ప్పే నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వా త ఆలయాల అభివృద్ధిని పూర్తిగా పక్కన పె ట్టారని అన్నారు.మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి నియోజక వర్గంలో పాత దేవాలయాల పునర్నిర్మాణం చే పట్టి,హిందుత్వ పరిరక్షణకు పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తుచేశారు.దేవాలయాల అభివృ ద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అర్చకుల సం క్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని పేర్కొ న్నారు.వచ్చే ఎన్నికల్లో కూడా బ్రాహ్మణులను మోసం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయ త్నిస్తోందని,ప్రజలు నిజాలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని జ్వాలాపురం శ్రీకాంత్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంకాల కృష్ణకాంత్,రాజశేఖర్,రామకృష్ణ,ఇతర నాయ కులు పాల్గొన్నారు.
Comments
Post a Comment