ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణుల దాడి...తీవ్రంగా ఖండించిన మాజీ ఎ మ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి...

ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణుల దాడి

తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్ర ఆగ్రహం

చిల్లర పనులు,బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న శిల్పా చక్రపాణిరెడ్డి

జిల్లా కలెక్టర్ స్పందించి ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేయాలి

శిల్పా కుటుంబం ఎవరికీ భయపడదు

తగ్గేదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్
నేటి పత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శ్రీశైలం,జూన్, 03 :

నంద్యాల జిల్లా,శ్రీశైలం నియోజకవర్గంలో రా జకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఆత్మకూ రులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీ డీపీ శ్రేణులు,గూండాలు ఈ దాడికి పాల్పడ్డా రంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరును ఆయన తీవ్రం గా ఖండించారు.చిల్లర రాజకీయాలు,ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసి న చక్రపాణిరెడ్డి...దాడులు చేస్తే ఇంతటితో ఆ గే ప్రసక్తే లేదంటూ 'తేలాలి నేనో...బుడ్డా రాజశే ఖర్ రెడ్డి తేలాలి' అంటూ బహిరంగ సవాల్ వి సిరారు.తనపై,తన కుటుంబ సభ్యులపై దు ర్భాషలాడి, దాడులకు ఉసిగొల్పిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై జిల్లా కలెక్టర్ స్పందిం చి,సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరోవై పు,మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.వై సిపి నాయకులు,కార్యకర్తలు ఎంతో సహనం తో ఉన్నప్పటికీ, టీడీపీ నాయకులే కావాలని రె చ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని భంగం కలి గిస్తున్నారని ఆరోపించారు.మహిళా జిల్లా కలె క్టర్ సమక్షంలోనే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రె డ్డి అసభ్య పదజాలం వాడటం దారుణమన్నా రు.శిల్పా కుటుంబం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే దేలేదంటూ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇ చ్చారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...