ప్రియుడితో కలిసి మరదలి దారుణం... బంగారం కోసం సొంత వదిన హత్య...
ప్రియుడితో కలిసి మరదలి దారుణం
బంగారం కోసం సొంత వదిన హత్య
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపురం నగరం లో బంగారు నగల కోసం సొంత వదినను హ త్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది.కుటుంబ బంధాలను మరిచి డబ్బు,బంగారంపై దురాశతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం...మే,28వ తేదీ అర్ధ రాత్రి సమయంలో భవ్య అనే మహిళ తన ప్రి యుడు లోహిత్‌కుమార్‌తో కలిసి తన వదిన పుష్పలతను హత్య చేసినట్లు విచారణలో వె ల్లడైంది.మొదట ఈ ఘటనను దొంగల దాడిగా చిత్రీకరించేందుకు భవ్య ప్రయత్నించింది.ఇం ట్లోకి దొంగలు చొరబడి దాడి చేశారని కుటుంబ సభ్యుల ను,పోలీసులను నమ్మించేలా నాటక మాడింది.అయితే ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు,భవ్య వాంగ్మూలంలో వచ్చిన అను మానాస్పద అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.విచారణలో అసలు విష యం బయటపడింది.భవ్యకు లోహిత్‌కుమా ర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసు లు గుర్తించారు.డబ్బు అవసరం,బంగారు నగ లపై ఆశతో వదిన పుష్పలతను అడ్డుతొలగిం చాలని భావించి ఈ హత్యకు పాల్పడినట్లు ఇ ద్దరూ అంగీకరించినట్లు సమాచారం.హత్య అ నంతరం ఇంట్లో ఉన్న బంగారు నగలను దో చుకొని,దొంగతనం జరిగినట్లు నమ్మించే ప్రయ త్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.కేసును ఛేదించిన పోలీసులు భవ్య,లోహిత్‌కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇక ఈ ఘటనలో కుటుంబ సభ్యులు,ముఖ్యంగా అత్తమామల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసా గిస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు విచా రణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.ఇటీవల ఆస్తి,డ బ్బు,వివాహేతర సంబంధాల కారణంగా కు టుంబాల్లోనే హత్యలు పెరుగుతున్న నేపథ్యం లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది.
Comments
Post a Comment