బస్సులో రద్దీ ఎక్కువగా ఉందా..?ఒంటిమీద ఉన్న నగలు జాగ్రత్త...ముఠాగా ఏర్పడి బంగా రు గొలుసు దొంగతనానికి పాల్పడిన నిందితు డి అరెస్ట్...రెండున్నర తులాల బంగారు గొలు సు స్వాధీనం...
బస్సులో రద్దీ ఎక్కువగా ఉందా..?
ఒంటిమీద ఉన్న నగలు జాగ్రత్త
ముఠాగా ఏర్పడి బంగారు గొలుసు దొంగత నానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్
రెండున్నర తులాల బంగారు గొలుసు స్వా ధీనం
బస్సులో ప్రయాణికుడి మెడలో నుండి బం గారు గొలుసు దొంగిలించిన కేసులో చాదర్ ఘాట్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి,ఒక పాత నేరస్థుడిని అరెస్ట్ చేశారు.నిందితుడి నుండి రెండున్నర తులాల బరువు గల బంగా రు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి.ఈ నెల 23వ తేదీన ఫిర్యా దుదారుడైన గట్టు సీతారామారావు (61) లా లాజార్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్ వద్ద టిఎస్ ఆర్ టిసి రూట్ నెంబర్ 72J బస్సు ఎక్కారు.బ స్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండ టాన్ని ఆసరాగా చేసుకుని,కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఫుట్‌బోర్డ్ సమీపంలో ఆయ న చుట్టూ గుంపుగా చేరి తోసేశారు.ఆ గందర గోళాన్ని అనుకూలంగా మార్చుకుని,నిందితు లలో ఒకరు సీతారామారావు మెడలో ఉన్న సుమారు 2.5తులాల బంగారు గొలుసును తెంపు కుని పారిపోయారు.బాధితుడు య శోద హాస్పిటల్ వద్దకు చేరుకున్నాక గొలుసు పోయినట్లు గమనించి,చాదర్‌ఘాట్ పో లీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలం పరిసరా ల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణం గా పరిశీలించారు.పాత ఆస్తిపాస్తుల నేరస్థుడై న హబీబ్ నగర్ మల్లేపల్లి,మంగర్‌బస్తీకి చెంది న ఆ టో డ్రైవర్ కంబ్లే రతన్ అలియాస్ రతన్ బాదల్‌గా నిందితుడిని గుర్తించారు.సమా చా రం మేరకు,శుక్రవారం మల్లేపల్లిలోని మంగర్ బస్తీ సమీపంలో పోలీసులు నిందితుడిని అదు పులోకి తీసుకున్నారు.అతనిని తనిఖీ చేయ గా దొంగిలించబడిన లాకెట్‌తో కూడిన 2.5తు లాల బంగారు గొలుసు లభించింది.దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విచార ణలో నిందితుడు తన అనుచరులైన ఎ2) సల్మాన్, ఎ3) ఇస్మాయిల్,ఎ4) ఇబ్రహీంలతో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించా డు.ప్రస్తుతం మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.ఈ కేసును ఛేదించడంలో చాదర్‌ఘాట్ పిఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్/ఎస్.ఐ బి.కృష్ణారెడ్డి,అతని బృందం,ఇన్‌స్పెక్టర్ కె.బి.మురారి,డి.ఐ బి.శ్రీనివాసరావుల మార్గ దర్శకత్వంలో...మ లక్‌పేట్ డివిజన్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి,చార్మినార్ జోన్ అడిష నల్ డీసీపీ కె.ఎం.డి.మజీద్‌ల పర్యవేక్షణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.సత్వరమే స్పందించి కేసును ఛేదించిన పోలీస్ బృందా న్ని చార్మినార్ జోన్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Post a Comment