అందరి సహకారంతోనే నగర పరిశుభ్రత... కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ... ఆంధ్రపారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెర గాలి...వీధుల్లో వ్యర్థాలు వేస్తే జరిమానా తప్ప దు...జిల్లా కలెక్టర్,నగరపాలక ప్రత్యేక అధికారి ణి డాక్టర్ ఏ.సిరి...

అందరి సహకారంతోనే నగర పరిశుభ్రత

కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర

పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

వీధుల్లో వ్యర్థాలు వేస్తే జరిమానా తప్పదు

జిల్లా కలెక్టర్,నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్టరే ట్,జూన్,21 :

ప్రజలందరి సహకారంతోనే నగర పరిశు భ్రత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్,నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్,కమిష నర్ చల్లా ఓబులేసుతో కలిసి స్వర్ణ ఆంధ్ర - స్వ చ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.అనం తరం ప్రజలు,ఉద్యోగులచే స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...గత నాలుగు వారాలుగా వివిధ అంశాలతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని,ఇది ప్రత్యేక డ్రైవ్‌గా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుం డా తడి,పొడి,హానికరమైన,ప్రత్యేకమైన వ్యర్థాల ను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకే అ ప్పగించడం విధిగా భావించాలని సూచించా రు.పర్యావరణానికి హాని కలిగించే వ్యక్తులకు జరిమానాలు విధించే అధికారాలను దేశ అ త్యున్నత న్యాయస్థానం కలెక్టర్లకు ఇచ్చినట్లు పేర్కొ న్నారు.ఎవరైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చే శారు.కమిషనర్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేష న్ క్లీన్ స్వీప్ పేరుతో గత నాలుగు వారాలుగా ప్రతి శనివారం ప్రత్యే క సిబ్బందితో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.రహదారులు,జంక్షన్లు,రెడ్-యెల్లో స్పాట్ల శుభ్రత,కాలువలు,డ్రైన్లు,వీధుల పరి శుభ్రత,వ్యర్థాల వర్గీకరణపై అవగాహన,మా ర్కెట్లు,వాణిజ్య ప్రాంతాల పరిశుభ్రత కార్యక్ర మాలు చేపట్టామన్నారు.చివరి వారంలో ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత,చెత్త పేరుకుపోయిన ప్రాంతాల శుభ్రత పనులు చేపట్టినట్లు పేర్కొ న్నారు.నగర శుభ్రత కోసం ప్రభుత్వం,నగర పాలక సంస్థ,పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి సహకరించాలని కమి షనర్ కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ క మిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,ప్రజారోగ్య అధి కారి డాక్టర్ ఎం.రఘు,సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు,డీఈఈలు పవన్ కుమార్ రెడ్డి, కృష్ణలత,ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర రావు,ఎంటమా లజిస్ట్ సత్యనారాయణ,స్వచ్ఛ సర్వేక్షణ్ కో ఆ ర్డినేటర్లు శ్రీనివాసులు,జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...