క్యాన్సర్,కీమోథెరపీతో వెంట్రుకలు ఊడిన అ బ్బాయి...అమ్మాయిల ఉన్నావంటూ ముగ్గురు పోలీసుల లైంగిక దాడి...
క్యాన్సర్,కీమోథెరపీతో వెంట్రుకలు ఊడిన అ బ్బాయి
అమ్మాయిల ఉన్నావంటూ ముగ్గురు పోలీసు ల లైంగిక దాడి
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువ కుడిపై ముగ్గురు పోలీసులు దారుణానికి ఒడి గట్టారు.కీమోథెరపీ చికిత్సతో కాళ్లు,చేతులకు వెంట్రుకలు ఊడిపోవడంతో అమ్మాయిలు ఉ న్నావంటూ వేధించడమే కాకుండా,అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.హర్యానాలోని కురు క్షేత్ర జిల్లాలో జరిగిన ఈ ఘటలన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ముగ్గురు పోలీసుల ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.బాధి తుడి కథనం ప్రకారం...హర్యానాలోని కురు క్షేత్ర జిల్లా బన్‌గావ్ గ్రామానికి చెందిన ఓ యు వకుడు (30) బ్యాంక్ ఉద్యోగి.కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతను కీ మోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు.,జూన్ 17వ తేదీన రాత్రి తన బైక్‌పై ఇంటికి వెళ్తుండ గా ఇంద్రి రోడ్డులో పోలీసులు తనిఖీ కోసం వా హనాన్ని ఆపారు.మొహానికి గుడ్డ కట్టుకోవడం తో అతన్ని ఆపి ఇద్దరు ఏఎస్సైలు,హోంగార్డు నిలదీశారు.యువకుడిని చెంపదెబ్బలు కొట్టి, మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా లద్వా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.తాను క్యాన్సర్ రోగిని అని...చికిత్స తీసు కుంటున్నానని చె ప్పినా పోలీసులు సదరు యువకుడిపై కని కరం చూపించలేదు.కీమోథెరపీ తర్వాత శరీ రంపై వెంట్రుకలు ఊడిపోతే...అతని అనారో గ్యాన్ని ఎగతాళి చేశారు.కాళ్లపై వెంట్రుకలు లే కపోతే అ మ్మాయిల స్మూత్‌గా ఉన్నావంటూ లైంగిక దాడికి పాల్పడ్డారు.పోలీసుల దుశ్చర్య త ర్వాత ఇంటికెళ్లిన యువకుడికి మరుసటి రోజు పిర్రల మధ్య రక్తస్రావం జరగడంతో కు టుంబసభ్యులకు విషయం చెప్పాడు.ఘటన తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తొలుత లద్వా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.పరిస్థితి మరింత విషమంగా ఉం డటంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.అనంతరం ఈ ఘటనపై బాధిత యువకుడు,కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా,వైద్య పరీక్షలు నిర్వ హించి యువకుడి కాలు విరిగిందని,లైంగిక దా డి జరిగిందని వైద్యులు నిర్ధారించారు.దీంతో అఘాయిత్యానికి ఒడిగట్టిన ఏఎస్సైలు సం జీ వ్ కుమార్,రాజేందర్ కుమార్,హోంగార్డు సు మిత్‌లపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ చంద్రమోహన్ తెలిపారు.ఆ ముగ్గుర్ని సస్పెండ్ చేశామని వెల్లడించారు.ఈ ఘటనపై విచార ణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొ న్నారు.
Comments
Post a Comment