ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేయాలి...టవర్ క్లాక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆకులు కట్టుకొని నిరసన...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేయాలి
టవర్ క్లాక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆకులు కట్టుకొని నిరసన
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వాలని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో అ నంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆకు లు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరస న తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్,అధ్యక్షులు తరి మెల గిరి,రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడు తూ బంగి శివ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభు త్వం పేద విద్యార్థుల పట్ల,ప్రభుత్వ విద్య పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అన్నారు.ప్రభు త్వ పాఠశాలలో తెరిచి రెండు వారాలు కా వస్తున్నా కూడా ఇప్పటివరకు విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిస్థాయిలో అందివలేదని అన్నారు. యుద్ధం కారణంతో విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వ డం లేదని ప్రకటనలో చేస్తున్నారన్నారు.అయి తే వాస్తవంగా దాదాపు రూ.870 కోట్ల రూపా యలు 2025,డిసెంబర్ నెలలోనే 2026-27 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థి మిత్రులకు కేటాయిస్తున్నామని చెప్పేసి,ముఖ్యమంత్రి, వి ద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ప్రభుత్వ ఉత్త ర్వులు ఇచ్చారన్నారు.అయితే యుద్ధం ఏర్ప డింది మార్చిలో...అంతకుముందే సిద్ధం చేయా ల్సిన యంత్రాంగం ఎందుకు సిద్ధం చేయలేదని అన్నారు.కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే ఆ లెక్కలు పరిమితమయ్యాయా? లేదంటే వి ద్యార్థి మిత్ర కిట్లను అందించడానికి ఏ పను లు మొదలుపెట్టాలని ప్రశ్నించారు. పూర్తిగా వి ద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్ర భుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది విద్యార్థులు విద్యార్థి మిత్ర కిట్లు లేక,యూనిఫామ్ లేక ఇబ్బందులు పడు తున్నారన్నారు.అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వేసుకోవడానికి యూనిఫాం లేక గత సంవత్సరం ఇచ్చిన యూ నిఫామ్ కుట్టుకునే దయనీయ పరిస్థితి ఉంద న్నారు.యుద్ధం వల్ల ఇంధనం కొత్త ఏర్పడింద ని,దీనివల్ల పరిశ్రమ నడవడం లేదని అందుకు లేటవుతుంది అని చెప్తున్నా,వాస్తవ పరిస్థితు లు చూస్తే ప్రభుత్వ హంగు ఆర్భాటాలకు,నా యకుల కాన్వాయ్ కు ఇంధనాన్ని వృధా చేస్తు న్నారన్నారు.అయినా కూడా ఇంధన కొరత పే రుతో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వక పొవడం దారుణం అన్నారు.అనంతపురం లాంటి కరువు జిల్లాలో తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి డబ్బులు లేక ప్రభుత్వ పాఠశా లల్లో వేస్తున్నారని ఆవేదన చెందారు.ఏది ఏమైనా తక్షణమే రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యా ర్థికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల ను అందజేయాలని,అవి నాణ్యమైనవిగా ఉం డేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకు లు వెంకటేష్,సూర్య ప్రకాష్,నవీన్,అరుణ్ రషీ ద్,జిల్లా కమిటీ సభ్యులు విజయ్,సాయికృష్ణ, వంశీ,జాక్,రాజేష్,సతీష్,గణేష్,మ హేష్,పరమే ష్,సాయి,యశ్వంత్,భాస్కర్,తదితరులు పాల్గొ న్నారు.
Comments
Post a Comment