రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి...సుప్రీంకోర్టులో పిటిషన్...
రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి
సుప్రీంకోర్టులో పిటిషన్
ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్ర మా లు,నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చే యాలని,సీబీఐ విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవహారాలు,పరిపాలన కు సంబంధించి ఆర్థిక అవకతవకలు,ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై సీబీఐ వి చారణ జరపాలని పిటిషన్ కోరింది.మరోవైపు విరాళాలకు సంబంధించి జరిగిన అవకతవక లపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ దా ఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పి ల్)ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చే సినందున,అత్యవసర విచారణ అవసరం లేద ని అభిప్రాయపడింది.
Comments
Post a Comment