సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి...త హసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్రజలు ధర్నా...
సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్ర జలు ధర్నా
కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామ పం చా యతీ,సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాల ని కోరుతూ సుందరయ్య నగర్ ప్రజలు మండ లం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేప ట్టారు.ధర్నాకు మద్దతు తెలియజేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ, మండల కార్యదర్శి హుసేనయ్య,గ్రామ ఎంపీ టీసీ గోపాల్ మాట్లాడారు.గొందిపర్ల గ్రామపం చాయతీ,సుందరయ్య నగర్ లో సర్వేనెంబర్ 236లో అప్పటి కర్నూలు శాసన సభ్యులు ఎం.ఏ.గఫూర్ ఐదు ఎకరాల పొలాన్ని కొనుగో లు చేసి 200మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి,పట్టా లు మంజూరు చేయించారని అన్నారు.ఆ రకం గా పట్టాలు మంజూరు చేసిన తర్వాత మిగిలి న కొంత భూమిని గ్రామ అవసరాల కోసం ప్ర భుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం కేటా యించారన్నారు.ఆ విధంగా ఏరియా ప్రజలు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారని,అయితే ప్రస్తు తం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభు త్వాలు ఆలోచన చేస్తుంటే,సత్తార్ అనే వ్యక్తి దాన్ని ఆక్రమించుకోవడం దుర్మార్గం అని మం డిపడ్డారు.ఇది నా స్థలం అని ప్రజలతో వాగ్వా దానికి దిగుతున్నారని అన్నారు.వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని,ప్రజల మంచినీటి కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చే శారు.ఇదివరకే రెండుసార్లు తెలియ చేసినప్ప టికీ అధికారులు స్పందించలేదని,ఇలాగే ని ర్ల క్ష్యం చేస్తే గ్రామప్రజలతో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.అనంతరం డి ప్యూటీ తాసిల్దార్ శివకు వినతి పత్రం అందజే శారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్,మోసే,రమ ణా రెడ్డి సుబ్బారెడ్డి,గోపాల్,ఈశ్వరయ్య,మునే శ్వరమ్మ,రాజేశ్వరి,మాణిక్యమ్మ,మరియమ్మ,రోజమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment