భర్త నుంచి ప్రాణహాని...ఎస్పీకి ఫిర్యాదు...
భర్త నుంచి ప్రాణహాని...ఎస్పీకి ఫిర్యాదు
భర్త నుంచి ప్రాణహాని ఉందని ఓ యువతి అ న్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చే సింది.వివరాలు ఇలా ఉన్నాయి.లక్కిరెడ్డి పల్లి మండలం,మద్దిరేవుల పంచాయతీ,అప్పల రాజుగారి పల్లెకు చెందిన రామరాజు ట్రాన్స్ కోలో కాంట్రాక్టు లైన్మెన్‌గా పనిచేస్తున్నాడు.అ తని భార్య ఎస్.లలిత ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించింది.2014లో తాను బి డ్డల్ని పుట్టినింటిలో వదలి బతుకుదెరువు కో సం కువైట్ వెళ్లి 2019లో తిరిగి వచ్చానని తె లిపింది.ఆరు తులాల బంగారం,సుమారు ఐ దు లక్షల నగదు భర్తకు ఇచ్చానని లలిత తెలి పింది.అంతా వాడేసి మరో మహిళతో వివాహే తర సంబంధం కొనసాగిస్తూ,తనపైనే నిందలు వేస్తున్నాడని ఆరోపించింది.తనను అంతమొం దించాలని చూస్తున్నాడని,భర్తతో పాటు అత ని స్నేహితులుతో కలిసి చంపడానికి కుట్ర ప న్నారని వాపోయింది.ప్రాణహాని ఉందని భ యంతో మూడు నెలల క్రితం కాకులారంలోని పుట్టింటికి వచ్చానని,అక్కడ కూడా దాడి చేసి వేధిస్తుండడంతో మదనపల్లెకు వచ్చి తలదా చుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది.పో లీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చే సుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Post a Comment