కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి కింద పడిన ఐదుగురు విద్యార్థులు...
కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి కింద పడిన ఐదుగురు విద్యార్థులు
దేశంలో ఎక్కడైనా పాఠశాల వాహనాలకు సం బంధించిన ప్రమాదాలు జరిగిన ప్రతి సారీ వి ద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి.అలాంటి ఘటనలు పునరావృతం కా కుండా ఉండేందుకు తల్లి,దండ్రులు,పాఠశాల యాజమాన్యాలు,విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండ టంతో పాటు భద్రతా నిబంధనలను కచ్చితం గా పాటించాల్సిన అవసరం ఉంది.తాజాగా గత శుక్రవారం బెంగళూరులోని కేఆర్ పురం ప్రాంతంలో ఓ కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి ఐదుగురు విద్యార్థులు కిందపడిన ఘ టన కలకలం రేపింది.అదృ ష్టవశాత్తూ వారికి తీవ్రగాయాలు కాలేదు.అయితే ఈ ఘటన పె ద్ద విషాదానికి దారి తీసే ప్రమాదం ఉండేది.కే వలం తక్కువ ఖర్చు అవుతుందనే కారణంతో రిజిస్ట్రేషన్ లేని స్కూల్ వ్యాన్లు,షేర్డ్ ట్యాక్సీల్లో పిల్లలను పంపించడాన్ని తల్లిదండ్రులు నివా రించాలి.పిల్లల ప్రాణ భద్రతకు ఎలాంటి ప్ర త్యామ్నాయం లేదు.అలాగే పాఠశాల విద్యా ర్థులను రవాణా చేసే అన్ని వాహనాలపై ప్రభు త్వం క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, రిజిస్ట్రేషన్ లేని లేదా నిబంధనలకు విరుద్ధం గా నడిచే వాహనాలపై కఠిన చర్యలు తీసుకో వాలి.ఒక నిర్లక్ష్యం,ఒక ప్రమాదం... ఒక కుటుం బాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టివేయగలదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
Comments
Post a Comment