కాబోయే భర్తకు యువతి ప్రైవేట్ పిక్స్ పంపిన ఉన్మాది...మనస్తాపంతో పెళ్లికూతురు,తల్లిదం డ్రుల ఆత్మహత్య...

కాబోయే భర్తకు యువతి ప్రైవేట్ పిక్స్ పంపిన ఉన్మాది

మనస్తాపంతో పెళ్లికూతురు,తల్లిదండ్రుల ఆత్మ హత్య
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మైసూరు,జూ న్,28 :

కర్ణాటకలోని మైసూరు జిల్లా కేంపైనహుండి గ్రామంలో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో తీ వ్ర విషాదం నెలకొంది.తన ప్రేమను తిరస్కరిం చిందనే కక్షతో ఓ యువకుడు పంపిన ప్రైవేట్ ఫోటోల కారణంగా మనస్తాపానికి గురై,పెళ్లికూ తురు ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆత్మహత్య కు పాల్పడింది.21ఏళ్ల రక్షితకు జూన్,24న వి వాహం జరగాల్సి ఉంది.అయితే గతంలో ఆ మెను ప్రేమించాలంటూ వేధించిన ఉల్లాస్ గౌడ అనే యువకుడిని రక్షిత,ఆమె తల్లి దండ్రులు అందరిముందూ తిరస్కరించారు.అప్పటినుం చి కక్ష పెంచుకున్న ఉల్లాస్ ఆ కుటుంబపై ఒత్తి డి తెస్తూనే ఉన్నాడు.జూన్,21రాత్రి రక్షిత తం డ్రి శివన్న (54), తల్లి నాగరత్న (44) ఉల్లా స్‌ను అతని తల్లిదండ్రులను తమ ఇంటికి పిలిపించి గట్టిగా హెచ్చరించారు.అంతేకాకుం డా ఉల్లాస్ మొబైల్‌లో ఉన్న రక్షిత ప్రైవేట్ ఫో టోలు,మెసేజ్‌లను డిలీట్ చేయించారు.అ యినప్పటికీ ఉల్లాస్ కొన్ని ఫోటోలను తన వద్దే ఉంచుకుని,ఇంటికి వెళ్లిన వెంటనే వాటిని రక్షి త కాబోయే భర్తకు పంపించాడు.దాంతో ఆగ్ర హానికి గురైన పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు నేరుగా రక్షిత ఇంటికి వచ్చి గొడవకు దిగడంతో వివాదం పెద్దదైంది.ఈ అవమానాన్ని తట్టుకో లేక రక్షిత,ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే విషం తాగి ప్రాణాలు విడిచారు.తమ చావుకు ఉల్లా స్ గౌడనే కారణమంటూ వారు రాసిన సూసైడ్ నో ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కే సు నమోదు చేసిన పోలీసులు,పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...