గందరగోళంగా ఎస్ ఐ ఆర్...కానరాని బిఎల్ ఓలు...పూర్తిచేసిన అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వా లో తెలియని దుస్థితి...ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు...సిపిఎం...
గందరగోళంగా ఎస్ ఐ ఆర్...కానరాని బిఎల్ ఓలు
పూర్తిచేసిన అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాలో తెలి యని దుస్థితి
ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు
సిపిఎం
ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వే గం దర గోళంగా తయారైందని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.సాయిబాబా,కే.సుధా కరప్ప,నగర కమిటీ సభ్యులు ఎస్.హుస్సేన్ భాష,ఎం.సి.ఆనంద్ లు బుధవారం ఒక ప్రకట నలో తెలిపారు.32వ వార్డు ముజఫర్ నగర్ లో ఎస్ ఐ ఆ ర్ సర్వే జరుగుతుందని,కానీ కొ న్ని ఇండ్లకు ఇంతవరకు బిఎల్ ఓలు రాలేద ని,అప్లికేషన్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నా రు.అంతేకాకుండా కొన్నిచోట్ల బిఎల్ ఓలు ఇం టికి వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు తప్ప అవి ఎ లా పూరించాలో,ఎక్కడ ఇవ్వాలో అనే విష యం తెలియక ప్రజలు గందరగోళానికి గురవు తున్నారని చెప్పారు.కొంతమంది తెలిసి తెలి యక పూరించిన అప్లికేషన్లు తీసుకొని సచివా లయం దగ్గరికి ఇవ్వడానికి వెళితే అక్కడ ఉ న్న అధికారులు మీకు అప్లికేషన్లు ఎవరు ఇ చ్చారో,వారి దగ్గరికి వెళ్లి ఇవ్వాలని,ఇది మాది కాదని సమాధానం చెప్పడం వల్ల అప్లికేషన్ లు ఎవరికి ఇవ్వాలో తెలియక విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.ఇలాంటి గందరగోల పరి స్థితుల్లో బిఎల్ ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అప్లికేష న్ నింపి,మళ్లీ అతనే అప్లికేషన్ తీసుకెళ్తే ప్రజల కు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.అలా గే 2002లో తమ ఓటు హక్కు ఉందో లేదో ప్ర జలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.అధికా రులు2002 ఓటర్ల జాబితాను బి ఎల్ ఓలకు ఇచ్చి పంపితే అందులో ఓటు ఉండేది లేనిది తెలుస్తుందన్నారు.ఇంటింటికి వెళ్లి చేయాల్సిన సర్వేను బిఎల్ ఓలు తప్పుదారి పట్టిస్తున్నార ని ఆవేదన చెందారు.ఇప్పటికైనా బిఎల్ ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలనీ,లేనిపక్షంలో ఎస్ఐ ఆర్ ను రద్దుచేసి,యధా మాములుగా ప్రస్తుత ఓటర్ల లిస్టు ప్రకారమే ఓటర్లను వెరిఫి కేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఆ లా చేయని పక్షంలో ప్రజలను సమీకరించి,సచి వాలయాలు,నగర పాలక సంస్థ,తహసీల్దార్ కా ర్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దశల వారీగా నిరసన తెలియచేస్తాం అని వా రు హెచ్చరించారు.
Comments
Post a Comment