ఐదు పెళ్లిళ్లు,అందరికి ఒకే మోసం... అనంతపురంలో నిత్య పెళ్లికూతురు అరెస్ట్...
ఐదు పెళ్లిళ్లు,అందరికి ఒకే మోసం
అనంతపురంలో నిత్య పెళ్లికూతురు అరెస్ట్
ఐదు పెళ్లిళ్లు చేసుకుని,అందరిని ఒకే విధంగా మోసం చేసి,ఆరవ పెళ్ళికి సిద్దపడ్డ నిత్య పెళ్లి కూతురును పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకా రం...విజయవాడకు చెందిన సుమప్రియ,అశో క్,శశికళ,రామకృష్ణ అనే మధ్యవర్తులతో కలిసి ఈమె ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.పెళ్లి సమయంలో కట్నం లేదా ఇతర ప్రలోభాలతో కూడిన హామీలు ఇ చ్చి,వివాహానంతరం కొద్ది రోజులు భర్తతో కలి సి ఉండి,ఆపై కనిపించకుండా పోవడం ఈమె పంథా అని పోలీసులు తెలిపారు.పెద్దవడు గూరు మండలం కాసేంపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని 2025లో ఈమె వివా హం చేసుకుంది.పెళ్లైన కొద్ది రోజులకే ఆమె ఎ వరికీ చెప్పకుండా అదృశ్యం కావడంతో, బాధి తుడు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇటీవల కర్ణా టకలోని మల్లికుప్పంకు చెందిన వ్యక్తిని వివా హం చేసుకున్న నిందితురాలు,పెళ్లైన ఆరు రో జులకే మద నపల్లె వైపు ప్రయాణిస్తుండగా పో లీసులకు చిక్కింది.మదనపల్లె మండలం చీక ల బైలు సమీపంలో పెద్దవడుగూరు ఎస్ఐ ఆం జనేయులు,సిబ్బంది ఆమెను అదుపులోకి తీ సుకున్నారు.ఒకరితో వివాహం జరిగిన విష యం మరొకరికి తెలియకుండా ఇలా ఐదుగు రిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచా రణలో వెల్లడైంది.
Comments
Post a Comment