రెండేళ్ల పాలన విజయోత్సవాలు కాదు...ఇచ్చి న హామీ ప్రకారం ఉద్యోగాలు కల్పించండి... లేదా నిరుద్యోగ భృతి ఇవ్వండి ఎఐవైఎఫ్...

రెండేళ్ల పాలన విజయోత్సవాలు కాదు

ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు కల్పిం చండి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వండి 

ఎఐవైఎఫ్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,22 :
 
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరు ద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర స మితి పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముం దు సోమవారం ధర్నా నిర్వహించారు.కార్య క్రమానికి ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి బీసన్న అధ్యక్షత వహించగా,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు,శ్రీనివాసులు మాట్లా డుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హా మీల్లో భాగంగా అధికారంలోకి వస్తే ప్రభు త్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగా లు భర్తీ చేస్తామని,ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి,ఉద్యోగాలు భర్తీ చే స్తామని,దాంతో పాటుగా రాష్ట్రంలో సంపద సృష్టించి 20లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పి స్తామని,అలా కల్పించలేని పక్షంలో నిరుద్యో గులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇ స్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.అయితే అ ధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయి తుందని,కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయో త్సవ సభలు నిర్వహిస్తున్నారని,ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగాల హామీని ఎందుకు నెరవేర్చడం లేదని వారు ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ పేరుతో నిర్వ హించే సభలు నిరుద్యోగులను మోసం చేసే స భలే అని వారి మండిపడ్డారు.ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగా లు భర్తీ చేయకుండా, 20లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయ కుండా,నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి హా మీ అమలు చేయకుండా,రాష్ట్రంలో నిరుద్యో గులను విజయవంతంగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.కూటమి ప్ర భుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డీఎస్సీ ని యామకాలలో అనేక అక్రమాలు జరిగాయని డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉం టే,వాటికి సమాధానం చెప్ప వలసిన కూటమి ప్రభుత్వం విజయోత్స వాల పేరుతో కాలయా పన చేస్తుందని మండిపడ్డారు.ఇప్పటికైనా కూ టమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యో గులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పత్రికా ప్రకటనలతో కాలయాపన చేస్తూ నిరు ద్యోగులను మోసం చేస్తామంటే ఏఐవైఎఫ్ గా చూస్తూ ఊరుకోమని,నిరుద్యోగులను ఏకతా టిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరే కంగా నిరుద్యోగుల హక్కులను సాధించేంత వరకు పోరాడుతామని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు నాగరాజు,నగర నాయకులు చంటి, శ్రీకాంతు, అఖిల్,కళాఖర్,వీరయ్య,హుస్సేన్ భాష,నాగేశ్వరరావు,ప్రభాకర్,రంగస్వామి,సు రేంద్ర యాదవ్,సూర్య మధు,కాసిం,శివ,రంగ న్న,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...