కంచె చేను మేస్తే...ప్రజలకు రక్షణ ఎక్కడ?... దొంగలతో చేతులు కలిపిన సిఐడి అధికారి...
కంచె చేను మేస్తే...ప్రజలకు రక్షణ ఎక్కడ?
దొంగలతో చేతులు కలిపిన సిఐడి అధికారి
సిఐడి అధికారి సాక్షాత్ దొంగల ముఠాకు నా యకుడిగా మారి దోపిడీలు చేస్తే ఇక పోలీసు వ్యవస్థ పరువు ప్రతిష్ట ఎక్కడుంటుందో ఆలో చించండి.కర్ణాటకలో జరిగిన దారుణం ఘటన ప్రజలను అప్రమత్తం చేస్తోంది.వివరాలు...కేర ళకు చెందిన ఓ వ్యాపారి రూ.20 లక్షలు డబ్బు లతో కర్ణాటకలోని మడివాలలో ఒక హోటల్లో దిగాడు.ఈ విషయం సిఐడి అధికారి మహేష్ కనకగిరికి,గ్యాంగ్ సమాచారం ఇచ్చింది.దీంతో నలుగురు ముఠా సభ్యులతో సిఐడి అధికారి తన పోలీసు వాహనంలోనే ఆ హోటల్ వద్దకు చేరుకున్నాడు.హోటల్ గదిలో ఉన్న వ్యాపార వేత్త దగ్గరికి తన దొంగల ముఠా సభ్యులు షఫీ, షని అనే వ్యక్తులను హోటల్లో పంపించి తా ము సిఐడి పోలీసులు అని చెప్పి బెదిరించి, రూ.20 లక్షలు తీసుకుని,ఈ డబ్బు ఎక్కడిదో స్టేషన్ కు వచ్చి చెప్పాలని,బ్యాగ్ తీసుకుని వ చ్చేశారు.హోటల్ కిందనే తన జీపులో ఎదురు చూస్తున్న సిఐడి అధికారి మహేష్ కనకగిరితో కలిసి అందరూ వెళ్లిపోయారు.కేరళకు చెందిన ఈ వ్యాపారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరి గిన దోపిడీని పోలీసులకు పిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ డబ్బు లు సిఐడి కార్యాలయానికి చేరలేదని తేలింది. దీంతో సీసీటీవీ దృశ్యాన్ని పరిశీలించి అందు లో ఒక అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.కూపేంద్ర ను విచారిస్తే మొత్తం జరిగిందంతా చెప్పేశా డు.సిఐడి అధికారి ఆధ్వర్యంలోనే పనిచేస్తా మని,ఆయన చెప్పిన దొంగతనాలు చేస్తుంటా మని వివరించాడు.ప్రస్తుతానికి సిఐడి అధికారి మహేష్ కనకగిరితో పాటు మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు.ఈ కేసు కర్ణాటకలో సంచల నం సృష్టిస్తోంది.
Comments
Post a Comment