ముఖ్యమంత్రి పర్యటన బంగారు గనుల పరిశీ లన,యజమానులతో చర్చకు పరిమితం కా కూడదు...తవ్వకానికి భూములిచ్చిన రైతుల కుటుంబాలను ఆదుకునే ప్రకటన చేయాలి... సిపిఎం డిమాండ్...
ముఖ్యమంత్రి పర్యటన బంగారు గనుల పరిశీ లన,యజమానులతో చర్చకు పరిమితం కా కూడదు
తవ్వకానికి భూములిచ్చిన రైతుల కుటుంబా లను ఆదుకునే ప్రకటన చేయాలి
సిపిఎం డిమాండ్
రాష్ట్ర ముఖ్యమంత్రి 24న కర్నూలు జిల్లాలో చేస్తున్న పర్యటన కేవలం బంగారు గనులను పరిశీలన చేయడానికి మాత్రమే కాకుండా... రాష్ట్రంలో ఒక భారీ పరిశ్రమ రావడానికి కార ణమైన రైతుల బాధలను పరిశీలించాలని సిపి ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి కోరారు. మంగళవారం కర్నూలు నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో సి పిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.ఎస్.రా ధాకృష్ణ,ఎం.డి.ఆనంద్ బాబుతో కలిసి మీడి యా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఈనెల 18న తుగ్గలి మండలం జొన్నగిరి,పగిడిరాయి,బొల్ల వానిపల్లె గ్రామాల మధ్య జియో మైసూర్ సర్వీ స్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ పేరుతో తవ్వు తున్న గోల్డ్ మైన్ ప్రాంతాన్ని సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించడంతోపాటు మైన్ తవ్వకం కోసం భూములు ఇచ్చిన రైతులను కలిసి వి వరాలు తెలుసుకున్నామన్నారు.ఎక్కడైనా సరే ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ని బంధనలు ప్రకారమే 2013 భూ సంస్కరణల చట్టం ప్రకారం భూమిని కోల్పోయిన రైతులకు అప్పుడు ఉన్న మా ర్కెట్ విలువకు మూడిం తలు అదనంగా ఇవ్వాలన్నారు.అదే విధంగా భూమిని కోల్పోయిన రైతు కుటుంబానికి ఉ ద్యోగం ఇవ్వాలని ఉన్నా...మాయమాటలు చె ప్పి భూమిని తీసుకున్న యాజమాన్యం ఏ కు టుంబానికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు.పరిశ్రమ కోసం కేవలం 350 ఎకరాలు మాత్రమే కొని, దాని చుట్టుపక్కల ఉన్న మరో 1200ఎకరాల భూమిని ఎకరాకు రూ.2000 నుండి రూ.10 000 వరకు సంవత్సరానికి ఒకసారి లీజు ఇ చ్చేలాగా మాట్లాడుకొని భూములు తీసుకు న్నారన్నారు.బంగారు పరిశ్రమ ప్రారంభానికి మొదటగా బొల్లవానిపల్లెకు చెందిన శ్రీనివాస రెడ్డి,రామచంద్రారెడ్డి తమ 10ఎకరాల భూ ములు ఇచ్చారని తెలియజేశారు.భూములు ఇచ్చిన అనంతరం రామచంద్ర రెడ్డి కుమా రుడు మహేశ్వర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మం చానికి పరిమితమయ్యాడని,కోలుకోని పరిస్థి తుల్లో ఉన్న ఆ కు టుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద న్నారు.మ హేష్ రెడ్డి భార్య రమాదేవి డిగ్రీ పూ ర్తి చేసిందని,ఆ కుటుంబానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశ్రమ ద్వారా ఉద్యోగం ఇచ్చే లా ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు.ఎక్కడైనా పరిశ్రమ వస్తుందంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు 70శాతం ఉద్యోగా లు ఇవ్వాలని,మొదట ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం,స్కిల్డు అన్ స్కిల్డ్ పేరు తో దాటవేస్తోందన్నారు.గ్రామంలోని మహిళల కు కొంతమందికి పనులు కల్పించిన,అవి కేవ లం క్యాంటీన్లో అంట్లు తోమడం,కసువు ఊడ్చ డం లాంటి పనులకు మాత్రమే పరిమితం చే సి,సెక్యూరిటీ గార్డులను సైతం జార్ఖండ్ హైద రాబాదు లాంటి ప్రాంతాల నుండి నియమిం చారన్నారు.నేడు వచ్చే ముఖ్యమంత్రి కాని,ఇ ప్పటిదాకా వెళ్తున్న అధికారులుగానీ,స్థానిక ఎ మ్మెల్యేగాని రోజువారి పరిశ్రమ యజమాని దగ్గ రికి వెళ్తున్నారు తప్ప అందుకు కారణభూత మైన రైతుల దగ్గరికి ఎవరు వెళ్లడం లేదన్నా రు.ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమ పరి శీలనకు దేనికోసం వస్తున్నారో అని ప్రజలు పె ద్దఎత్తున చర్చించుకుంటున్నారని,దానిపైన మేము ఇప్పుడే కామెంట్ చేయం కానీ,పరిశీల న అనంతరం రాష్ట్ర ముఖ్య మంత్రి మాటలను బట్టి నిర్ధారించుకొని మాట్లాడతామన్నారు.సి పిఎం జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు ఎం.డి.ఆ నంద్ బాబు మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద బంగారు గనులలో మొదటి స్థానంలో ఉన్నట్లు తుగ్గలి గణికి సంబంధించి ప్రచారం జ రుగుతోందని,కరువు ప్రాంతంగా ఉన్న కర్నూ లు జిల్లాకు అత్యంత పెద్ద బంగారు గని ఉంది అని గర్వపడాలో...దేశానికి గనిని అందించిన రైతాంగం నేటికీ కష్టాల సుడిగుండంలో ఉందని బాధపడాలో అర్థం కావడం లేదన్నారు.జియో మైసూర్ గోల్డ్ మైన్ ప్రాంతాన్ని పరిశీలన చేయ డంతో పాటు బొల్లవానిపల్లె గ్రామాన్ని సంద ర్శించినప్పుడు గ్రామంలో ఉన్న రైతులు దేశమే గర్వించదగ్గ పరిశ్రమ వస్తుందన్న దానితో 70 శాతం భూములను అప్పగించామని అయితే గ్రామానికి సంబంధించి న పేరు కూడా వినపడ టం లేదని బాధపడ్డారన్నారు.70శాతం భూ ములు ఇచ్చిన గ్రామాన్ని కనీసం దత్తత తీసు కొని బాగుపరచాలన్న చిత్తశుద్ధి కూడా కంపెనీ కి లేదని,ఇంటికో ఉద్యోగం ఇచ్చే మాట అటు ఉంచి పరిశ్రమ ప్రారంభానికి ముందుండి మొ దట భూములు ఇచ్చిన కుటుంబంలో మనిషి పడిపోయినా,ఆ కుటుంబానికి సైతం ఉద్యోగం ఇవ్వడం లేదని తెలియజేశారన్నారు.వెనుక బడ్డ ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే పరిశ్రమ లు,నిధులు,నీళ్లు అవసరమన్నారు.దానికి అవ సరమైన కార్యాచరణ ఇప్పటికైనా రాష్ట్ర ము ఖ్యమంత్రి ప్రకటించాలని లేనిపక్షంలో ఆందోళ న తప్పదన్నారు.
Comments
Post a Comment