సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి...త హసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్రజలు ధర్నా...
సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్రజ లు ధర్నా
కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామ పం చాయ తీ,సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవా లని కోరుతూ సుందరయ్య నగ ర్ ప్రజలు మం డలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చే పట్టారు.ధర్నాకు మద్దతు తెలియజేస్తూ సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృ ష్ణ,మండల కార్యదర్శి హుసేనయ్య,గ్రామ ఎం పీటీసీ గోపాల్ మాట్లాడారు.గొందిపర్ల గ్రామపం చాయతీ,సుందరయ్య నగర్ లో సర్వేనెంబర్ 236లో అప్పటి కర్నూలు శాసన సభ్యులు ఎం.ఏ.గఫూర్ ఐదు ఎకరాల పొలాన్ని కొను గోలు చేసి 200మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి,ప ట్టాలు మంజూరు చేయించారని అన్నారు.ఆ రకంగా పట్టాలు మంజూరు చేసిన తర్వాత మి గిలిన కొంత భూమిని గ్రామ అవసరాల కోసం ప్రభు త్వ కార్యాలయాల నిర్మాణం కోసం కేటా యించారన్నారు.ఆ విధంగా ఏరియా ప్రజలు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారని,అయితే ప్రస్తు తం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభు త్వాలు ఆలోచన చేస్తుంటే,సత్తార్ అనే వ్యక్తి దాన్ని ఆక్రమించుకోవడం దుర్మార్గం అని మం డిపడ్డారు.ఇది నా స్థలం అని ప్రజలతో వాగ్వా దానికి దిగుతున్నారని అన్నారు.వెంటనే ఆ స్థ లాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని,ప్రజల మంచినీటి కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.ఇదివరకే రెండుసార్లు తెలియ చేసిన ప్పటికీ అధికారులు స్పందించలేదని,ఇలాగే నిర్లక్ష్యం చేస్తే గ్రామప్రజలతో ఆందోళన ఉదృ తం చేస్తామని వారు హెచ్చరించారు.అనంత రం డిప్యూటీ తాసిల్దార్ శివకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్,మో సే,రమణా రెడ్డి సుబ్బారెడ్డి,గోపాల్,ఈశ్వర య్య,మునేశ్వరమ్మ,రాజేశ్వరి,మాణిక్యమ్మ, మరియమ్మ రోజమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment