కృష్ణలంకలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం...తండ్రి,కు మారుడిపై దారుణ దాడి...దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు...
కృష్ణలంకలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం
తండ్రి,కుమారుడిపై దారుణ దాడి
దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు
విజయవాడ కృష్ణలంకలో సోమవారం రాత్రి బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది.కరకట్టపై శి శుభవన్ సమీపంలో ఓ కుటుంబానికి చెందిన తండ్రి,కుమారుడిపై దుండగులు బ్లేడ్‌లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థా నికంగా కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...కృష్ణలంకకు చెందిన భాను, ఆయన కుమారుడిపై చెక్క కుమార్ అనే వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం.ఈ దాడి లో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా,ముఖ్యంగా బాలుడి గొంతు భాగంలో తీవ్ర గాయాలు అ యినట్లు తెలుస్తోంది.గాయపడిన వారిని స్థా నికులు వెంటనే కృష్ణలంకలోని శ్రీరామ్ ఆసుప త్రికి తరలించారు.అయితే గాయాల తీవ్రత ఎ క్కువగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికి త్స కోసం వారిని విజయవాడ ప్రభుత్వా సుప త్రికి (జీజీహెచ్) తరలించారు.బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా స మాచారం.ఘటనకు గంజాయి మత్తులో తిరిగే బ్లేడ్ బ్యాచ్ సభ్యులే కారణమన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.తరచూ కర కట్ట పరిసరాల్లో అ సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని,ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.సమా చారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘట న స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుల కుటుంబ సభ్యులు,ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు నమోదు చేస్తున్నారు.దాడికి గల కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment