కూలీలను కబళించిన ప్రమాదం...టైరు పేలడం తో బోల్తాపడ్డ టాటా ఏస్...ముగ్గురు మృతి...

కూలీలను కబళించిన ప్రమాదం

టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్

ముగ్గురు మృతి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,తూర్పుగోదా వరి,జూన్,23 :

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రంగంపేట మండలం వడిశలేరు–రంగం పేట మధ్య టా టా ఏస్ గూడ్స్ వాహనం టైరు పేలడంతో అ దుపుతప్పి బోల్తా ప డింది.ఈ ఘటనలో ము గ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.పోలీసుల వివరాల ప్రకారం...సామర్లకోట,పిఠాపురం ప్రాం తాలకు చెందిన కూలీలు బాపట్ల జిల్లా,కొల్లూ రులో రెడీమిక్స్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. కూలీలతో పాటు నిర్మాణ సామగ్రిని కూడా వా హనంలో తరలిస్తుండగా ప్రమాదం సంభవిం చింది.మృతులను సామర్లకోటకు చెందిన మా సకపల్లి బాబు,మురమళ్ల రాజు,కాకాడ రాజు గా గుర్తించారు.ప్రమాదంలో గాయపడిన ఎని మిది మందిని చికిత్స నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతదేహా లను పోస్టుమార్టం కోసం రాజ మహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుప త్రికి (జీజీహెచ్) పం పించారు.ఘటనపై కే సు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తు చేపట్టారు.ప్రాథమికంగా టైరు పేలడమే ప్ర మాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...