ముస్లింల స్మశాన వాటిక సమస్యపై స్పందించ కపోతే ఆందోళన ఉధృత చేస్తాం...ఆర్డీఓ కా ర్యాలయం ముందు ప్రజాసంఘాల ఆందోళ న...

ముస్లింల స్మశాన వాటిక సమస్యపై స్పం దించకపోతే ఆందోళన ఉధృత చేస్తాం

ఆర్డీఓ కార్యాలయం ముందు ప్రజాసం ఘాల ఆందోళన
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు మండ లం,జూన్,21 :

కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలోని ము స్లింల స్మశాన వాటిక సమస్యపై స్పందించకపో తే ఆందోళన ఉధృత చేస్తాం అని ప్రజాసంఘా ల నాయకులు హెచ్చరించారు.ఈ మేరకు శని వారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ముందు బాధిత ముస్లిం షాదిక్ అధ్యక్షతన ధర్నా కార్య క్రమం చేపట్టారు.ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశిం చి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు,రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్య దర్శి గురుశేఖర్,ఆవాజ్ సంఘం రాష్ట్ర నాయ కుడు షరీఫ్,సిఐటియు జిల్లా నాయకులు నగే ష్,హుస్సేనయ్య,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అంజి లు మాట్లాడారు.కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో ముస్లింల స్మశానాన్ని కూల్చడమే కా కుండా,వారిపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంట నే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.స్మశాన గోడను కూల్చి మూడు రోజులు గడుస్తున్నా, ముస్లింలు ఆందోళన చేస్తున్న రెవెన్యూ అధికా రులు,జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరం అన్నారు.79 సంవత్సరాల స్వతం త్ర భారతంలో కనీసం ఉండడానికి ఇల్లు కూడా నిర్మించలేని ప్రభుత్వాలు ప్రజలు చస్తే ఆరడు గుల గుంత తీసుకోవడానికి కూడా ఇబ్బంది పె ట్టే పరిస్థితి ఉందంటే అధికారులు పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. స్మశానాల కోసం స్థలం కేటాయించలేని ప్రభు త్వం,ఇతరులు దానం చేసిన వాటిని కూడా రక్షించలేకపోతే ప్రభుత్వ పాలన విధానం అర్థ మవుతుందన్నారు.వెంటనే గోడ కూల్చిన బా బురెడ్డి,అసదుల్లా,శాలిభాష,ఇస్మాయిల్,తది తరులను అరెస్టు చేయాలని,కూల్చిన చోటే గోడనిర్మాణం ప్రభుత్వం నిర్మించాలని,ము స్లింలకు రక్షణ కల్పించాలని,స్మశాన వాటిక గోడకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నా యకులు ఆంజనేయులు,బాలపీరా,వ్యవసా య కార్మిక సంఘం నాయకులు శ్రీరాములు,ప్ర కాష్,కిషన్ రెడ్డి,బాధిత ముస్లింలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...