శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వా మి వారికి విశేషపూజలు...
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వా మి వారికి విశేషపూజలు
లోకకల్యాణంకోసం దేవస్థానం ఆలయ ప్రాంగ ణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ ద త్తాత్రేయస్వామివారికి శ్రీశైల దేవస్థానం ఆధ్వ ర్యంలో విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరి పించబడుతోంది.ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందు గా మహాగణపతి పూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచా మృతాభిషేకం,విశేషపూజలు నిర్వహించబడ్డా యి.లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు, మహేశ్వ రులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు.అందుకే త్రిమూర్తి స్వరూపు నిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.కాగా శ్రీశైల క్షే త్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సం బంధం ఉంది.ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశా రని ప్రతీతి.అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.కాగా దత్తాత్రేయస్వామి వారు కలియుగంలో గోదావరితీరాన పిఠాపురంలో శ్రీ పాద వల్లభునిగా జన్మించారు.వీరు ఒకసారి శ్రీ శైల క్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిం చినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది.కాగా శ్రీ పాద వల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థ క్షే త్రాల మహిమా విశేషాలను పేర్కొనే సందర్భం లో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు. శ్రీ పాద వల్లభుల జన్మ తరువాత మహారాష్ట్ర లోని కరంజి నగరంలో నృసింహ సరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించా రు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీ శైల మల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురు చ రిత్ర చెబుతోంది.నృసింహ సరస్వతి వారు త మ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగం గలోనే చేశారు.కలియుగ ప్రభావం రోజు రోజు కు ఎక్కువకావడంతో,నృసింహ సరస్వతీ స్వా మి అదృశ్య రూపంలో ఉండి తన భక్తులను ర క్షించాలని నిర్ణయించారు.దాంతో భౌతిక దేహా న్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలి సి శ్రీశైలానికి వచ్చారు.శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహ సరస్వతి స్వామి వారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని,కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటి ఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది.
Comments
Post a Comment