మహిళల భద్రత,రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి...మహిళల రక్షణ కోసం ఆపరేషన్ దండయాన...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్....
మహిళల భద్రత,రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
మహిళల రక్షణ కోసం ఆపరేషన్ దండ యాన
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ,మ హిళల భద్రత,చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన “ఆపరేషన్ దండయాన” కా ర్యక్రమంలో భాగంగా గురువారం కోడుమూరు లోని ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీవాసవి కళ్యా ణ మండపంలో ఆపరేషన్ దండయాన పోస్టర్ల ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవి ష్కరించారు.ఈ సందర్బంగా మహిళల భద్ర త,నేరాల నివారణ,చట్టాలపై అవగాహన సద స్సు నిర్వహించారు.అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...మహిళ లపై జరిగే నేరాల నివారణకు జిల్లా పోలీసు శా ఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తోందన్నారు.ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగా హన ఉండాలని,ఏది నేరం,ఏది నేరం కాదనే వి షయాలను తెలుసుకోవడం అత్యంత అవస రమన్నారు.ముఖ్యంగా యువత,18సంవత్స రాలు నిండిన విద్యార్థులు పోక్సో చట్టం సహా వివిధ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉం డాలని సూచించారు.మహిళల పట్ల ప్రతి ఒక్క రూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నా రు.ఎక్కడైనా నేరం జరిగినా లేదా నేరం జరిగే అవకాశం ఉందని భావించినా వెంటనే పోలీ సులకు సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.మహిళలకు ఏ చి న్న సమస్య వచ్చినా భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయా లని సూచించారు.ఫిర్యాదు చేసిన వారి వివరా లు,పేర్లు,ఫోన్ నంబర్లు పూర్తిగా గోప్యంగా ఉం చుతామని స్పష్టం చేశారు.మహిళలు మహిళా పోలీసు సిబ్బందికి కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.మహిళల రక్షణ కో సం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటార ని,ఎటువంటి వేధింపులు లేదా ఏవైనా సమ స్యలు ఎదురైనా భయపడకుండా పోలీసుల ను సంప్రదించాలని సూచించారు.కుటుంబ క లహాలు తలెత్తి నప్పుడు పోలీసులకు సమా చారం అందిస్తే కౌన్సిలింగ్ ద్వారా దాదాపు 90 శాతం సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.సమస్యలను దాచిపెట్టకుండా పోలీ సుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్,డయల్- 112,100,మహిళల హెల్ప్‌లైన్ 181,చైల్డ్‌లైన్ 1098,సైబర్ నేరాల కోసం 1930 హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలన్నారు.సమా చారం అందిన వెంటనే బాధితుల లొకేషన్‌ను గుర్తించి పోలీసులు స్పందిస్తారని తెలిపారు. పోలీసులు ప్రతి ప్రాంతానికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కాదని, అందువల్ల ప్రజలు కూడా చట్టాలపై అవగాహ న పెంపొందించుకోవాలన్నారు.చట్టాలపై అవ గాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయన్నారు. నేరం జరిగినప్పు డు వెంటనే పోలీసులకు స మాచారం ఇవ్వగల ధైర్యం,నమ్మకం ప్రజల్లో పె రగాలన్నారు.అలాగే సమాచారం అందిన వెం టనే పోలీసులు స్పందిస్తారనే విషయం కూడా తెలియాలన్నారు.అడిషనల్ ఎస్పీ జె.బాబు ప్రసాద్ మాట్లాడుతూ...పిల్లల పట్ల శ్రద్ద వహిం చాలన్నారు.చెడు అలవాట్లకు బానిసలు కా కుండా చూడాలన్నారు.మహిళలు తమ హ క్కులపై అవగాహన కలిగి ఉండాలని,సైబర్ నే రాలు,ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అప్రమ త్తంగా ఉండాలన్నారు.బాల్య వివాహాలు లేదా మహిళలపై వేధింపులు జరిగినా వెంటనే పోలీ సులకు సమాచారం అందించాలన్నారు.అర్సె లర్ మిట్టల్/విండ్ పవర్ సంస్థ ప్రతినిధులు శ్రీధర్ మాట్లాడుతూ...తమ సంస్థల్లో మహిళ లకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఉద్యోగాల్లో చేరే పురుష ఉద్యోగులకు మహిళ లపై నేరాల ని వారణ అంశంపై ముందస్తుగా అవగాహన కల్పిస్తామని,మహిళల పట్ల గౌరవ ప్రదంగా వ్యవహరించేలా ప్రత్యేక సూచనలు అందజేస్తామని పేర్కొన్నారు.తదనంతరం ప్ర భుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి మం చి మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్దుల ను ఎస్పీ అభినందించారు.శాలువతో సన్మా నించి,జ్ఞాపికలు అందజేశారు.వాలీబాల్ క్రీడల పోటిలలో గెలుపొందిన విద్యార్దులకు బహు మతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కోడు మూరు ఇంచార్జ్ ఎంపిడిఓ క్రిష్ణారెడ్డి,కోడుమూ రు ఎమ్ ఈఓ రామచంద్రుడు,కోడుమూరు సీ ఐ తబ్రేజ్,ఎస్సై ఎర్రిస్వామి,సి. బెళగల్ ఎస్సై వేణుగోపాల రాజు,అర్సెలర్ మిట్టల్ / విండ్ ప వర్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్,కిరణ్,పోలీసు సిబ్బంది,డ్వాక్రా,పొదుపు సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు,మహిళలు తదితరులు పాల్గొ న్నారు.
Comments
Post a Comment