మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా ఓబులేసు సూచ న...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం

పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా ఓబులేసు సూచన
సాగర్ సందేశం న్యూస్,కర్నూలు కార్పోరేషన్, జూన్,02 :
    
మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి,ఈగల్‌ (ఎలైట్‌ యాం టీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) కు సహకారం అందిం చాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపుని చ్చారు.క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మ ధ్య విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమత్తం గా ఉండాలని,ఎక్కడైనా డ్రగ్స్‌,గం జాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం,విక్ర యం,సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972 కు సమాచారం అందించాలని సూచించారు. సోమవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాల యం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్ర వ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సం దర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడు తూ...మాదకద్రవ్యాలు యువత భవిష్య త్తు ను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపా డేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.అనుమానాస్పద కార్యకలాపాలు,మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం అందించడం ద్వారానే రాల నియంత్రణకు తోడ్పడవచ్చ న్నారు.పారిశుద్ధ్య కార్మికులు నగరంలోని ప్రతి ప్రాంతంలో తిరుగుతూ విధులు నిర్వహిస్తుం డటంతో,వారి సహకారం మాదకద్ర వ్యాల ని ర్మూలనలో కీలకంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఈగల్ బృందం సభ్యులు మాద కద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు,యువ తపై వాటి ప్రభావం, అనుమానాస్పద కార్యక లాపాలను ఎలా గుర్తించాలి,సమాచారం ఎలా అందించాలి అనే అంశాలపై అవగాహన క ల్పించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్ఐ సు జన్,టీం సభ్యులు ఎలిషా,మాసుంవలి,శానిటే షన్ ఇన్‌స్పెక్టర్ అనిల్,పారిశుద్ధ్య సిబ్బంది,తది తరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...