స్కూల్,కళాశాలల్లో సీట్ల అడ్మిషన్ల పేరుతో జ రుగుతున్న సైబర్ మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి...కర్నూ లు ఎస్పీ విక్రాంత్ పాటిల్...
స్కూల్,కళాశాలల్లో సీట్ల అడ్మిషన్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల విద్యా ర్థులు,తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
అడ్మిషన్ల సీజన్ లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు
ఆన్ లైన్ చెల్లింపులు చేసే ముందు నిజ నిర్ధా రణ చేసుకోండి
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం,జూన్, 03 :ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్,కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసా గుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త త రహా మోసాలకు పాల్పడుతున్నారని కర్నూ లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.కొంతమంది మోసగాళ్లు ప్రముఖ పాఠశాలలు,కళాశాలల ప్రతినిధుల మని నమ్మబలికి ఫోన్ కాల్స్,వాట్సాప్ సందేశా లు,సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సంప్ర దిస్తూ సీట్లు పరిమితంగా ఉన్నాయి.రూ.10 వేలు,లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అ డ్వాన్స్‌గా చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోండి అంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తెలిపారు.ఇలా డబ్బులు చెల్లించిన తర్వాత సంబంధిత విద్యాసంస్థలను సంప్రదిస్తే,తమ వద్ద ఎలాంటి రుసుము జమ కాలేదని,ఆ వ్య క్తులకు తమ సంస్థతో సంబంధం లేదని తెలప డం జరుగుతుంది.ఈ విధంగా అనేక మంది సై బర్ మోసగాళ్ల బారిన పడుతున్నారని హెచ్చ రించారు.తల్లిదండ్రులు,విద్యార్థులు అడ్మిష న్లకు సంబంధించిన ఫీజులను కళాశాల లేదా పాఠశాల అధికారిక కార్యాలయం,అధికారిక వె బ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచిం చారు.అపరిచిత వ్యక్తులు పంపిన బ్యాంకు ఖా తాలు,యూపీఐ ఐడీలు,క్యూ ఆర్ కోడ్‌లకు డ బ్బులు పంపవద్దన్నారు.ఏదైనా విద్యాసంస్థ పే రుతో ఫోన్ కాల్ వ చ్చినప్పుడు ముందుగా సంబంధిత సంస్థ అధికారిక నంబర్ల ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలని సూచించా రు.సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని,లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.సమయా నికి ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును తి రిగి పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నా రు.ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క ర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చే శారు.
Comments
Post a Comment